రాష్ట్రీయం

కేరళకు 500 టన్నుల బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: కేరళలో భారీ వరదల కారణంగా వాటిల్లిన అపార నష్టానికి తోటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అందించిన రూ.25 కోట్ల ఆర్థిక సహాయానికి అదనంగా మరో ఐదు వందల టన్నుల బియ్యాన్ని పంపాలని నిర్ణయించింది. కేరళ రాష్ట్రానికి వెంటనే 500 టన్నుల బియ్యాన్ని పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆకున్ సభర్వాల్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన ఆదేశంతో సుమారు కోటి రూపాయల విలువ చేసే 500 టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళ రాష్ట్రానికి ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించగా, వారు కేరళ అధికారులతో
మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడాని బియ్యం అవసరం ఉందని అక్కడి అధికారులు కోరగానే సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా తమ రాష్ట్రానికి రూ. 25 కోట్ల నగదుతో పాటు నీటిశుద్ధి యంత్రాలు, పౌష్టికాహారం పంపడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం కేసీఆర్‌కు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేరళకు అందించిన విరాళానికి తోడు టీఆర్‌ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించి తమ నెల రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
గెజిటెడ్ అధికారులు కూడా
కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా స్పందించింది. ఒక రోజు వేతనాలను సేకరించి, రూ.10 కోట్ల చెక్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అందజేసింది. సంఘం గౌరవాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వీ. మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్ తదితరుల బృందం సచివాలయంలో సోమవారం సీఎస్ జోషికి చెక్కును అందజేసింది. కేరళలో శబరిమలకు వెళ్లే భక్తులలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉంటారని, ఈ విపత్కర పరిస్థితిలో వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ స్పందించాలని టీజిఏ అధ్యక్షురాలు మమత పిలుపునిచ్చింది.

చిత్రం..సీఎస్ జోషికి చెక్‌ను అందజేస్తున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు