ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ శాస్తవ్రేత్త డాక్టర్ ఎంవి రావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం: ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త , మాజీ ఎమ్మెల్సీ పద్మశ్రీ డాక్టర్ ఎంవి రావు (87) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన డాక్టర్ ఎంవి రావు భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేశారు. ఆకుపచ్చ విప్లవ సేనానిగా ఆయన గుర్తింపుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా, భారత వ్యవసాయశాఖ శిక్షణ, పరిశోధన సంస్థ ప్రత్యేక సంచాలకునిగా, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎంవి రావు సేవలందించారు. ప్రస్తుత నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎంవి రావుకు ముని మనుమడు. డాక్టర్ ఎంవి రావు మృతి పట్ల నరసాపురం శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసన సభ్యులు కొత్తపల్లి జానకీరామ్, ముదునూరి ప్రసాదరాజు, సర్వోదయ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.