క్రైమ్/లీగల్

బాంబు పేలుళ్ల కేసు తీర్పు 4కు వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై తీర్పు సెప్టెంబర్ 4న వెలువడనున్నది. సోమవారం కేసు విచారణను చర్లపల్లి సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులో సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు తీర్పును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు. పేలుళ్ళ కేసుతో సంబంధం ఉన్న ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనీఖ్ షఫీక్ సయ్యద్, మహ్మద్ సాదిక్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సర్ అహ్మద్ షేక్‌ను 2008 సంవత్సరంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం ప్రత్యేక స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (సీఐసెల్) కేసును దర్యాప్తు నిర్వహించింది. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ జంట బాంబు పేలుళ్ళతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 25వ తేదీతో ఘటన జరిగి 11 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ కేసులో సుమారు 170 మంది సాక్ష్యులను విచారించారు. ఈ నెల 7 వరకు వాదోపవాదాలు కొనసాగాయి.