రాష్ట్రీయం

‘సాగరమాల’పై విశాఖ పోర్టు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు విశాఖ పోర్టు ట్రస్టు దృష్టి సారించింది. సాగరమాల కింద ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి, నౌకాయానం, సరకు రవాణా, నౌకానిర్మాణం వంటివి చేపట్టేందుకు కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలివేటెట్ సరకు రవాణా కారిడార్ నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులను విశాఖ పోర్టు ట్రస్టు ప్రతిపాదిస్తోంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడులను సమకూర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల కింద దేశంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద సరుకు రవాణా మరింత వేగవంతం చేసే అంశంపై పోర్టు దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి కానె్వంట్ జంక్షన్‌తో సీహార్స్ జంక్షన్‌ను కలుపుతూ 8 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సరుకు రవాణా కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించింది. పోర్టు ఆవరణలో గోడ ఎత్తును ఏడు మీటర్ల మేరకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.200 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేస్తోంది. ఈ మేరకు పెట్టుబడులను ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కారిడార్ నిర్మాణం వల్ల రహదారిపై రద్దీ తగ్గడంతో పాటు సరకు రవాణాలో వేగం పెరుగుతుంది. షీలానగర్ నుంచి సబ్బవరం బైపాస్, అనకాపల్లి నుంచి ఆనందపురం రహదారిని నాలుగు లేదా ఆరు లైన్లుగా విస్తరించే ఆలోచన ఉంది.

తిరుమలలో ప్రైవేట్ వసతి గృహాలకు అనుమతి లేదు!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: తిరుమలలో ప్రైవేటు వసతి గృహాల నిర్మాణానికి అనుమతిచ్చేది లేదని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేశారు. శాసన మండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తిరుమల కొండపై ప్రైవేటు అతిథి గృహాలను నిర్మించేందుకు స్థలాలను సమకూర్చే ప్రతిపాదన ఉందా? అని ఎమ్మెల్సీ తిప్పే స్వామి అడిగిన ప్రశ్నకు మాణిక్యాల రావు సమాధానం చెపుతూ తిరుమల కొండలపై ప్రైవేటు నిర్మాణాలను 2005-06లోనే నిషేధించారని అన్నారు. కొండలపై పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. దీనిపై తిప్పేస్వామి మాట్లాడుతూ తిరుమల కొండపై వందల కోట్ల రూపాయలతో అతిథి గృహాలు నిర్మించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తున్నారని, ఆ గృహాలను టిటిడికే అప్పగించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ, తిరుమలలో అందుకు అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు.