రాష్ట్రీయం

బీజేపీ శకం ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 6: దేశంలో భారతీయ జనతా పార్టీ శకం ముగిసిపోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొననున్న కర్నూలు బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఊమెన్ చాందీ గురువారం విలేఖరులతో మాట్లాడారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహారాలు, అభివృద్ధి, తదితర అనేక కీలకాంశాల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ఆ పార్టీ నేతలు సైతం మోదీ విధానాలను అంగీకరించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కేవలం అయిదేళ్ల కాలంలో బీజేపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. రానున్న ఏ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీపై ప్రజావ్యతిరేకత ప్రారంభమైందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన అనంతరం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో పనిచేస్తే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, నాయకులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శైలజానాథ్, అహ్మద్ అలీఖాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..కర్నూలులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ