రాష్ట్రీయం

సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించడంతో రాజకీయ సందడి మొదలైంది. 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన కేసీఆర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాలకు వెళ్లి, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సై అంటే, బీజేపీ ఈ చర్యను అప్రజాస్వామ్యమంటూ గగ్గోలు పెట్టింది. కేసీఆర్ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడితే, అదే స్థాయిలో ప్రతివిమర్శలు కూడా వెల్లువెత్తాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం జరిగే బహిరంగ సభతో కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అప్రమత్తమైన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యేందుకు తగినంత సమయం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యారన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద రెండు ప్రధాన పార్టీలతోపాటు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్న బీజేపీ, టీడీపీలోనూ ఎన్నికల సందడి మొదలైంది. చిన్నాచితకా పార్టీలు కూడా రాబోయే సమరానికి అస్తశ్రస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ రద్దుతో మొదలైన ఎన్నికల రేసులో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి సస్పెనే్స!