రాష్ట్రీయం

రేవంత్‌రెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు కావడానికి కొద్ది సేపటి ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇలాంటి పిచ్చోడు ప్రాతినిథ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం ఇష్టం లేకనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం పక్కన పెట్టేశారని, పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికీ, ప్రజాస్వామ్య విలువలకూ ఎక్కడా తావులేదని, తుగ్లక్ పాలన కన్నా దారుణంగా రాష్ట్రంలో పాలన ఉందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ గత అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు చంద్రబాబుతో సమావేశమైనపుడు రేవంత్ రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబే కనుక ఆయనకే తన రాజీనామా ఇచ్చానని అప్పట్లో రేవంత్ చెప్పారు. ఆయన రాజీనామా ఇంతవరకూ పెండింగ్‌లోనే ఉంది. గురువారం అనూహ్యంగా స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి రాజీనామాను అందజేశారు.