రాష్ట్రీయం

భద్రతకు, సమయపాలనకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రయాణీకుల భద్రతను పరిరక్షించడానికి, రైల్వే సేవల సామర్ధ్యాన్ని పెంచడానికి నిశిత పర్యవేక్షణ అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ రవీందర్‌గుప్తా అన్నారు. రైల్ నిలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డిఆర్‌ఎంలు వీడియో కానె్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. రైళ్లలో అనుమతించబడిన మేరకే లోడింగ్ జరగడానికి సాంకేతిక పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రయాణీకుల మన్ననలు పొందాలంటే సమయపాలన అనేది చాలా ముఖ్యమైన అంశమని అన్నారు.
అవసరమైతే ఇతర జోన్ల అధికారులను సంప్రదించడం, వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా రైళ్ల ఆలస్యాన్ని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన అదనపు జనరల్ మేనేజర్ ఎస్‌కె గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ ఎస్.ఎన్.సింగ్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూధనరావు, చీఫ్ కమ్మర్షియల్ మేనేజర్ ఎంపి రెడ్డి, సీనియర్ డిప్యూటీ జిఎం గజానన్ మాల్యా పాల్గొన్నారు.