రాష్ట్రీయం

ఇదిగో రద్దు.. అదిగో గెజిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శాసనసభ రద్దు.. గవర్నర్ ఆమోదం.. ఆపద్ధర్మ ప్రభుత్వ గెజిట్ విడుదల అంతా కలయా.. వైష్ణవ మాయా? అన్న రీతిలో రెప్పపాటులో జరిగిపోయాయ. శాసనసభ రద్దు వ్యవహారమంతా క్షణాల్లో జరిగిపోవడం సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. శాసనసభ రద్దు ప్రతిని రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒక చేతితో అందించగానే, దానిని ఆమోదిస్తూనే... దానికి సంబంధించిన గెజిట్‌ను మరో చేతితో గవర్నర్ ముఖ్యమంత్రికి అందజేసారు. శాసనసభ రద్దు తీర్మానాన్ని కేసీఆర్ అందజేయగానే ఆమోదిస్తూ జారీ చేయాల్సిన గెజిట్ ప్రభుత్వ ప్రింటింగ్‌కు వెళ్లి రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. కానీ సీఎం ఇలా అందజేయగానే, గవర్నర్ అలా గెజిట్ ఇవ్వడాన్ని చూస్తే అంతా ‘ముందస్తు’ మాయలానే కనిపిస్తోంది.