రాష్ట్రీయం

ఆ 14 సీట్ల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: టీఆర్‌ఎస్ గురువారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో 14 స్థానాలను పెండింగ్‌లో పెట్టడం వెనుకనున్న మతలబు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 105 స్థానాలకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన జాబితాలో ఇద్దరు సిట్టింగ్‌లు మెదక్ జిల్లా అంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు, ఆదిలాబాద్ జిల్లా చెన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించారు. మరో ఐదు స్థానాలలో పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానాల్లోని సిట్టింగ్‌లను పిలిచి మాట్లాడిన తర్వాత వారం పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు మీడియా సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. పెండింగ్ పెట్టిన స్థానాల్లో మల్కాజ్‌గిరి (కనకారెడ్డి), చొప్పదండి (బొడిగే శోభా), వికారాబాద్ (సంజీవరావు), వరంగల్ ఈస్ట్ (కొండా సురేఖ), మేడ్చల్ (సుధీర్‌రెడ్డి) సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. అలాగే ఎంఐఎం సిట్టింగ్‌లు ప్రాతినిధ్యం వహిస్తోన్న మలక్‌పేట, చార్మినార్ రెండు స్థానాలు, కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజూర్‌నగర్, కోదాడ, జహీరాబాద్ మూడు స్థానాలు మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇందులో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే హుజూర్‌నగర్, ఆయన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహించే కోదాడ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జే. గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించే జహీరాబాద్ ఉన్నాయి. వీరి స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఖరారు చేసే ఉద్దేశంతోనే పెండింగ్ పెట్టినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. వరంగల్ ఈస్ట్ స్థానంలో పార్టీ సిట్టింగ్ కొండా సురేఖ ఉన్నప్పటికీ ఈమేకు టికెట్ పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ స్థానంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని కొండా సురేఖను స్వయంగా గురువారం ఉదయం హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. పార్లమెంట్‌కు కానీ, రాజ్యసభకు కానీ పంపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు కూడా మరో ప్రచారం జరుగుతోంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి ఆనారోగ్యం కారణంగా, మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని సర్వేలో తేలడం వల్ల టికెట్ ప్రకటించలేదని తెలిసింది.