ఆంధ్రప్రదేశ్‌

ఐదుగురు ప్రముఖులకు బొమ్మిడాల అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం నిస్వార్థంగా ఆయా రంగాల్లో కృషి చేస్తున్న మహనీయ వ్యక్తులను ఘనంగా సత్కరించి వారికి మరింత ఉత్తేజాన్ని, ఆపై ఆదర్శమూర్తుల ద్వారా యువతకు స్ఫూర్తిని కలిగించే సదాశయంతో గుంటూరు కేంద్రంగా రూపుదిద్దుకున్న బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్ మూడోసారి ఈ నెల 19వ తేదీ సాయంత్రం గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వివిధ రంగాల నుంచి ఎంపికైన ఐదుగురికి స్ఫూర్తి అవార్డులు ఇవ్వనుంది. ప్రముఖ పొగాకు వ్యాపారి బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి పేరిట ఏర్పాటైన ఫౌండేషన్ మొదటి ఉత్సవానికి శాంతా సిన్హా, రెండో ఏడాది తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈ దఫా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా, రవాణా మంత్రి శిద్దా రాఘవరావు విశిష్ట గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. సభకు అలహాబాద్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించనున్నారని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశాల స్ఫూర్తి అవార్డుల కమిటీ కార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ చరిత్రకారులు ప్రొ.వకుళాభరణం రామకృష్ణ, ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వి.సింగారావు తెలిపారు. జస్టిస్ అంబటి లక్ష్మణరావు నేతృత్వంలో ఏర్పాటైన న్యాయ నిర్ణేతల బృందం 2015 స్ఫూర్తి అవార్డులకు ఐదుగురిని ఎంపిక చేసింది. సామాజిక సేవా రంగంలో భీమవరానికి చెందిన డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు ఎంపికయ్యారు. వీరు ఇద్దరు 20 లక్షల మంది వికలాంగులు, పోలియో వ్యాధిగ్రస్థులను పరిక్షించి మూడు లక్షల మందికి పైగా శస్తచ్రికిత్సలు చేశారు. సామాజిక స్పృహతో కూడిన తెలుగు సాహిత్యాన్ని అందించిన తెనాలి మండల కారుమూరివారిపాలెంకు చెందిన కేశవరెడ్డి రెండోవారు. వీరి కవితా సంకలనాలు సాహితీ లోకంలో సంచలనం సృష్టించాయి. ఇక మూడో వ్యక్తి అనాధలైన నిరుపేద బాల బాలికలను సర్వ సమర్థులైన పౌరులుగా తీర్చిదిద్దడంలో హీల్ ఇండియా సంస్థను స్థాపించిన డాక్టర్ కోనేరు సత్యప్రసాద్. నాలుగో వ్యక్తి ప్రకృతి సేద్యం రూపకర్త సుభాష్ పాలేకర్. చివరిగా సాయుధులై ఉగ్రవాదులను ఎదుర్కోడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పఠాన్‌కోట అమరవీరుడు హవాల్దార్ జగదీష్ చంద్. వీరి తరఫున ఆయన సతీమణి స్నేహలత ఈ స్ఫూర్తి పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ పురస్కారాల కింద మూడు లక్షల రూపాయలు చొప్పున నగదుతో పాటు జ్ఞాపికలు అందించనున్నారు.