రాష్ట్రీయం

సకాలంలో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానకి సంబంధిత అధికారులు కృషి చేయాలని దక్షణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సూచించారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జోన్ల పరిధిలో పని చేస్తున్న ఉన్నతాధికారులతో జిఎం సమీక్షా సమావేశాం నిర్వహించారు. చేపట్టిన పనుల్లో ఏక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సలహా ఇచ్చారు. సమావేశంలో ముఖ్యంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్‌విఎస్‌ఎల్), రైల్వే ఎలక్ట్ఫ్రికేషన్ (ఆర్‌ఈ) నిర్మాణ సంస్థతో పాటు అన్ని విభాగాల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణతో పాటు రాష్ట్రాల వాటా నిధులు పొందడం, అటవీ మరియు జంతు సంరక్షణకు చేపట్టిన చర్యలు, హైటెన్సన్ విద్యుత్ తీగెలు దాటడం మరియు సిగ్నల్, టెలికాం కేబుల్స్ ఎత్తివేత తదితర అంశాలను పరిష్కరించడానికి వేగంగా చేపట్టాలన్నారు. నిధుల మంజూరు, ఖర్చు, ప్రతిపాధిత రైల్వే పనులకు డ్రాయింగులు వాటి అంచనాల వ్యయం మొదలైనవి పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ ఎంఎంటిఎస్- 2, కాజిపేట్- విజయవాడ ట్రిప్లింగ్, పర్భని- ముద్‌ఖేడ్ డబ్లింగ్ నడికుడి- శ్రీకాళళస్తి కొత్త మార్గం, కల్లూరు- గుంతకల్లు డబ్లింగ్, మనోహరబాద్- కొత్తపల్లి మార్గం, నంద్యాల- యర్రగుంట్ల కొత్తలైన్, కాజిపేట్- బల్హర్ష ట్రిప్లింగ్, గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్, అకోలా- ఖాండ్వా గేజ్ మార్పిడిలకు చేపట్టిన పనుల్లో పురోగితి సాధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఆర్‌విఎస్‌ఎల్, ఆర్‌ఈ నిర్మాణ సంస్థల ముఖ్య పరిపాలనా అధికారి విజయ్ అగర్వాల్, వివిధ ప్రాజెక్టులకు ముఖ్య ఇంజనీర్లు ప్రస్తుతం కొరసాగుతున్న పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన తాజా పరిస్థితిని సమగ్రంగా జనరల్ మేనేజర్‌కు వివరించారు. సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ ముఖ్య ఇంజనీర్ శివప్రసాద్, ముఖ్య ఆపరేషన్ మేనేజర్ మధుసూదనరావు, ఆర్థిక, సలహాదారులు పద్మినీ రాధాకృష్ణన్, ముఖ్య పరిపాలనా అధికారి(కన్సస్ట్రక్షన్) విజయ్ అగర్వాల్, కమ్యూనికేషన్ అధికారి వినయ్‌మోహన్ శ్రీవాస్తవ, రైల్లే ప్రధాన పౌసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ పాల్గొన్నారు. అంతకు ముందు దక్షణమధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు. నాందేడ్ డిఆర్‌ఎంలతో జిఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టుల పనుల తీరుపై జిఎం వాకబ్ చేశారు.