రాష్ట్రీయం

‘పోలవరం’ నిర్మాణం సంతృప్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాగానే జరుగుతోందని, అయితే నాణ్యతాపరంగా కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేయడానికి సూచనలు అందిస్తామని కేంద్ర జల వనరుల శాఖ పర్యవేక్షక కమిటీ ఛైర్మన్ వైకె శర్మ అన్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వైకె శర్మ నేతృత్వంలో సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ ఆర్‌కె పచోరీ, డిప్యూటీ డైరెక్టర్ ఎన్‌కె సింగ్, సీఎస్సార్ శాస్తవ్రేత్త డాక్టర్ ఆర్ చిత్ర, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ ఎకె ప్రదాన్‌లు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు.
తొలుత వారు ప్రాజెక్టు నమూనాను పరిశీలించి, ప్రాజెక్టు నిర్మాణ స్వరూపాన్ని ఇఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు ద్వారా తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఏజెన్సీ కార్యాలయంలో ఇఎన్‌సీ ఎం వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. 1980 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య శంకుస్థాపన నాటి నుంచి, 2005వ సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం వరకు వివరించారు. గత మూడేళ్లుగా జరిగిన ప్రాజెక్టు పనుల వివరాలు బృందానికి తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 40 టీఎంసీలు చొప్పున అధికంగా వాడుకోవచ్చని వివరించారు. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఐదు టీఎంసీలు చొప్పున గోదావరి జలాలు వాడుకోవచ్చునని వివరించారు. ఎన్ని లక్షల ఎకరాలు సాగు స్థిరీకరణ జరుగుతుందన్న విషయాన్ని వారికి వివరించారు. ఇప్పటివరకు ఎంత శాతం పనులు జరిగాయి, ఖర్చుల వివరాలతోపాటు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న బృందం నిర్మాణాన్ని పరిశీలించారు. కమిటీ ఛైర్మన్ వైకె శర్మ కాంక్రీట్ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతీ దానిని ఫొటోలు తీసుకున్నారు. 1 నుంచి 14 బ్లాకుల వరకు నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ నిర్మాణం బాగానే జరుగుతుందని, కాంట్రాక్టు ఏజెన్సీ నిర్మాణాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ పనులు చేయాలన్నారు. నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సమీక్షించి అధిగమించాలన్నారు.
అనంతరం రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న కమిటీ సభ్యులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి రెండు కొండల మధ్యనున్న గ్యాప్-3 వద్ద కాంక్రీటు వాల్ పటిష్ఠంగా నిర్మించాలని ప్రాజెక్టు సీఈ వి శ్రీ్ధర్‌కు సూచించారు. అక్కడ నుంచి డయాఫ్రంవాల్ నిర్మించిన ప్రాంతం వద్దకు చేరుకున్న బృందానికి జర్మనీకి చెందిన నిర్మాణ సంస్థ అయిన బావర్ కాంట్రాక్టు ఏజెన్సీ ఇంజనీర్ హాసన్ డయాఫ్రంవాల్ నిర్మాణాన్ని మ్యాప్ ద్వారా వివరించారు. సుమారు ఆరు గంటలపాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గడిపిన కేంద్ర కమిటీ సభ్యులు అనంతరం రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్లారు.