రాష్ట్రీయం

ముందస్తు ముసళ్ల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్జాల చంద్రశేఖర్
----------------------
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ముందస్తు ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. విపక్షాల్లో అనైక్యత, పాజిటీవ్ ఓటుతో తిరిగి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలన్నది అధికార పార్టీ టీఆర్‌ఎస్ వ్యూహం. అయితే, ఈ అనైక్యత టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పరిణమించకుండా ఇతర విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతివ్యూహ రచన చేస్తున్నది. టీఆర్‌ఎస్‌ను ఓడించే ఏకైక లక్ష్యంతో రాజకీయంగా తమకు బద్ధశత్రువైన టీడీపీతోనూ జతకట్టేందుకు కాంగ్రెస్ సిద్ధపడింది. మరోవైపు టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకరావడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు సముఖంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి సీపీఎం ససేమిరా అంగీకరించడం లేదు.
పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, కోదండరామ్‌కు చెందిన తెలంగాణ జనసమితితో కలిసి పని చేయడానికి మాత్రమే ఆ పార్టీ సానుకూలంగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల కూటమీ ఒకవైపు, సీపీఎం నేతృత్వంలో తెలంగాణ జనసమితి, జనసేన మరో కూటమీగా బరిలోకి దిగితే, రెండు కూటములతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీల విధిగా పోటీలో ఉంటాయి. దీంతో తెలంగాణలో చతుర్ముఖ పోటీ తప్పదు. అదే జరిగితే, అధికార టీఆర్‌ఎస్‌కే లాభం చేకూర్చే అవకాశం ఉంటుందని ప్రధాన పక్షం కాంగ్రెస్ ఆందోళన చెందతున్నది. అందుకే, అలా కాకుండా రెండు కూటములను ఏకం చేసి త్రిముఖ పోటీ మాత్రమే ఉండే విధంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కాగా, కాంగ్రెస్‌తో కలిసి పని చేయలేమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ వ్యూహానికి ఆ పార్టీ మొకాలడ్డుతోంది. ఇలావుంటే, విపక్షాల అనైక్యతనే తమకు శ్రీరామరక్షగా టీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌తో కలవకుండా సీపీఎం చేస్తోన్న ప్రయత్నం మరింత బలపడేందుకు జనసేన పార్టీ ద్వారా టీఆర్‌ఎస్ నరుక్కు వచ్చే అవకాశం లేకపోలేదని విశే్లషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌తో సత్సంబంధాలున్నాయి.
కాంగ్రెస్, టీడీపీ కూటమితో తెలంగాణలో కలిసి పని చేయడం ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు ఇబ్బందికరం. దీంతో సాధ్యమైనంత వరకు కాంగ్రెస్‌తో జతకట్టకుండా సీపీఏం వైఖరికి జనసేన మద్దతుగా నిలిచే అవకాశం ఏర్పడింది. దీంతో తెలంగాణలో విపక్షాల మధ్య ఆనైక్యత అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారకుండా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నది. అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం, జనసేన అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసే వ్యూహం ఫలిస్తే పాలకపక్షానికి ఇబ్బందికర పరిస్ధితి తప్పకపోవచ్చు.