రాష్ట్రీయం

మోదీ విధానాలు ఎండగడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 7: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 10న భారత్ బంద్ విజయవంతం చేయాలని, అందుకు అన్ని విధాలుగా సహకరించాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి శుక్రవారం అన్ని రాజకీయ పక్షాల అధ్యక్షులు, కార్యదర్శులకు లేఖలు రాశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ ధరలను తగ్గించకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రబాబుకు కూడా టీడీపీ జాతీయ అధ్యక్షుని హోదాలో లేఖ పంపించారు
10న దేశవ్యాప్త హర్తాళ్: వామపక్షాలు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే హర్తాళ్‌ను రాష్ట్ర ప్రజానీకం జయప్రదం చేయాల్సిందిగా పది వామపక్షాల నేతలు జల్లివిల్సన్(సీపీఐ), వై వెంకటేశ్వరరావు (సీపీఎం), వై.సాంబశివరావు(సీపీఐ- ఎంఎల్ న్యూడెమూక్రసీ), పెనె్మత్స సుందరరావు రాజు (్ఫర్వడ్డ్ బ్లాక్) తదితరులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న ఆర్థికభారాలు ప్రజల నడ్డిని విరిచేస్తున్నాయని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల పెంపుదలతో కోట్లాది భారతీయుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అన్నారు.