రాష్ట్రీయం

కర్నూలులో హైకోర్టు బెంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆయన హైకోర్టు బెంచి ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ లోపు పూర్తవుతాయన్నారు. ఆ వెంటనే ఈ విషయాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్ నుంచి హైకోర్టును అమరావతికి తరలించే విషయంపై అప్పుడు హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటాయన్నారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేక శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కొల్లు విమర్శించారు. విభజన అనంతరం అనేక
సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించే క్రమంలో ప్రభుత్వానికి అన్నివిధాల సహకారం అవసరమని తెలిపారు. తన వంతు సహకారం అందించి సమస్యలను పరిష్కరించడం ఇష్టం లేకనే జగన్ పాదయాత్ర పేరుతో రోడ్లపై తిరుగుతూ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. తానూ రాకపోగా పార్టీ శాసనసభ్యులను
సభకు పంపకపోవడానికి కారణం వారిపై నమ్మకం లేకపోవడమేనని మంత్రి ఆరోపించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు మాట్లాడి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొంది తన కంటే ఎక్కువ ఆదరణ పొందుతారన్న దుర్భుద్దితోనే జగన్ ఎవరినీ సభకు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ శాసనసభ్యులెవరూ లేకపోవడంతో సభ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. సమస్యలపై చర్చించడానికి ఎక్కువ సమయం లభిస్తోందని మంత్రి వెల్లడించారు.

చిత్రం..రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర