రాష్ట్రీయం

తొలగిన అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో విలీన మండలాల ఓటర్లు తొలిసారిగా రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌తో తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు, ఎటపాక, చింతూరు, విఆర్ పురం, కూనవరం మండలాల్లో ప్రజలు ఈ సారి ఏపీలో ఓట్ల వల్లనైనా తమ పరిస్థితులు కుదుటపడే పరిస్థితి కనబడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఈ ప్రస్తావన రావడంతో ఓటర్ల జాబితా గందరగోళం తలెత్తింది. అయితే అధికారులు ఏడు మండలాల ఓటర్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేయడంతో గందరగోళానికి తెరపడింది. ఏపీలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వారికి వచ్చింది. ఇప్పటి వరకు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఈ విలీన మండలాల ఓటర్లు ఇపుడు ఏపీలోకి విలీనం కావడంతో భౌగోళికంగా కొత్తగా ఆవిర్భవించిన చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చారు. సాధారణంగా మూడు మండలాల వరకు ఒక్కో నియోజకవర్గంలో ఓటర్లు ఉంటారు. కొత్తగా మరో డివిజన్‌గా ఏర్పడిన ఈ ఓటర్లు వాస్తవానికి మరో నియోజకవర్గానికి సరిపడేంత సాంకేతిక ప్రామాణికత కలిగి ఉన్నారని తెలుస్తోంది. నియోజకవర్గాల విభజన ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఈ విలీన ఓటర్ల జాబితాను రంపచోడవరం నియోజకవర్గంలోనే విలీనం చేశారు. ఓటర్ల జాబితా మాటెలా ఉన్నప్పటికీ తమ కష్టాలు మాత్రం తీరలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వుంది. ఎందుకుంటే కనీస సదుపాయాలకు దూరంగా కాలం వెళ్లదీస్తున్నారు. విలీనమైన తర్వాత విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు ఖాళీ అయిపోయారు. ఒట్టిపోయిన మంచినీటి పధకాలను బాగు చేయించే పరిస్థితి లేదు. ఏపీలోకి మారినట్టు పంచాయతీ భవనాలపై బోర్డులు మార్పించిన వైనం తప్ప గ్రామ సచివాలయాల్లో పాలన ప్రజా దూరంగా ఉంది. ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఎక్కడికెళ్ళి చెప్పాలో తెలియని స్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇపుడిపుడే ఏపీ పాలన అలవాటులోకి వచ్చింది.
పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుకునూరు, ఎటపాక, చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన నేపధ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన ఈ మండలాల పరిస్థితి నాలుగేళ్ళు గడిచినప్పటికీ అగమ్యగోచరంగానే వుంది. విలీన మండలాల్లో కనీస అవసరాలు కరువై రెంటికీ చెడిన రేవడిలా తయారైంది. విద్యాలయాల్లో ఉపాధ్యాయులంతా తెలంగాణ ఆప్షన్‌లో వెళ్ళిపోవడంతో ఉపాధ్యాయుల కొరత తలెత్తింది. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి నెలకొనడంతో ఎట్టకేలకు గత ఏడాది చింతూరులో విలీన మండలాలకు ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటైంది. క్రమేణా ఆంధ్రా పాలన గాడిలో పడుతోంది. అప్పటి వరకు ఖమ్మం జిల్లా పరిధిలో వున్న ఈ మండలాలను రెవెన్యూ పరంగా తూర్పు గోదావరి జిల్లాలో కలిపిన తర్వాత జిల్లా కేంద్రమైన కాకినాడ వెళ్ళాలంటే సుమారు 260 కిలో మీటర్ల దూరం. తెల్లవారు జామున బయలుదేరి రాత్రికి ఇంటికి చేరుకోలేని స్థితి. ఆ మరుసటి రోజు తప్ప స్వగ్రామానికి చేరుకోలేని వైనం. విలీనం కాక ముందు వీరంతా ప్రతీ అవసరానికి భద్రాచలంతో ముడిపడి ఉండేవారు. విద్యార్థులకు మరీ గందరగోళం ఎదురయ్యింది. పదవ తరగతి భద్రాచలంలో
చదివితే, ఇంటర్ స్థానికత్వం కోసం అక్కడ చదవడానికి లేదు. డిఎస్సీ అయితే అప్పటి వరకు చదువుకున్న చదువంతా తెలంగాణలో అయితే డిఎస్సీకి వచ్చేసరికి ఏపీలో పరిగణించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పాలన పరంగా, సదుపాయాల పరంగా చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో వౌలిక సదుపాయలను కలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఓటర్లంతా రంపచోడవరం ఎస్సీ నియోజకవర్గంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ల జాబితాపై ఏపీ ఎలక్షన్ కమిషన్ నుంచి స్థానిక అధికారులకు ఉత్తర్వులు అందడంతో ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. దీంతో గందరగోళానికి తెరపడింది.