రాష్ట్రీయం

అందరి సమస్యలూ తీరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపట్నం (విశాఖపట్నం), సెప్టెంబర్ 8: వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర విశాఖ నగరంలో ప్రవేశించింది. పెందుర్తి నియోజకవర్గ పరిధి జెర్రిపోతులపాలెంలో శనివారం పాదయాత్ర ప్రారంభించిన జగన్ మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి పెదనరవ, కోటనరవ, కొత్తపాలెం మీదుగా గోపాలపట్నం పాదయాత్ర చేరుకుంది. అక్కడ్నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జగన్ యాత్ర కొనసాగింది. జెర్రిపోతులపాలెంలో శనివారం ప్రారంభించిన పాదయాత్ర రాత్రి ముగిసే సమయానికి 8.6 కిమీ నడిచి 2918.9 కిమీ యాత్ర పూర్తి చేశారు. యాత్ర యావత్ జగన్‌ను స్థానికులు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. జెర్రిపోతులపాలెం, నగర ప్రాంతాల్లో స్థానికులు, రైతులు గత నాలుగేళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులు ఏకరవు పెట్టారు. సాగుచేసుకుంటున్న తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. అధికార టీడీపీ నాయకులు బలవంతంగా తమ భూములు ఆక్రమించుకుంటున్నారని దళితులు జగన్‌తో చెప్పుకున్నారు. గ్రామానికి చెందిన అరుణ అనే మహిళా రైతు జగన్‌ను కలిసి, దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ రైతు అవార్డుతో సత్కరించిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే విశ్రాంత వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి జగన్‌ను కలుసుకున్నారు. జగన్ పాదయాత్ర విశాఖ నగరానికి చేరుకున్న తరుణంలో జనం ప్రభంజనంలా వచ్చి యాత్రలో పాలుపంచుకున్నారు. అక్కడి నుంచి జగన్ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ జగన్‌కు స్వాగతం పలికారు. ఇదే సందర్భంలో జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి వరకూ చదువుకున్న స్నేహితులు కలిశారు. వీరిని పేరుపేరునా పలుకరించి జగన్ ఆప్యాయతను చాటుకున్నారు.
వైసీపీలో చేరిన నేదురుమల్లి రామ్ కుమార్
జగన్ పాదయాత్ర కోటనరవకు చేరుకోగానే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ రెడ్డి జగన్‌ను కలుసుకుని పార్టీలో చేరారు. నెల్లూరు నుంచి సుమారు 3000 మంది కార్యకర్తలతో తరలివచ్చిన రామ్‌కుమార్ రెడ్డిని అధినేత జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. జగన్‌ను సీఎం చేయాలన్నదే తమ లక్ష్యమని, అందుకు పనిచేస్తామని స్పష్టం చేశారు.
చిత్రం..నేదురుమల్లి కుమారుడు రామ్‌కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్