రాష్ట్రీయం

తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల ఇల్లు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ అంటే కల్వకుంట్ల వారి ఇల్లు కాదని కొండా దంపతులు ధ్వజమెత్తారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని నిలదీశారు. మంత్రి కేటీఆర్ తమకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని, ఆయన కోటగిరీ కోసం రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో పేరు లేకపోవడం తీవ్ర అసంతృప్తికి, మనోవేదనకు గురిచేసిందని కొండా దంపతులు అన్నారు. ‘మేమేం తప్పుచేశామో చెప్పకుండా, పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెడుతున్నారు’ అని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీ మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని, పరకాల నుంచి పోటీ సిద్ధమైన తనను వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ కోరారని సురేఖ అన్నారు. ఆ సమయంలో మంత్రి పదవి సైతం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, మంత్రి పదవి ఇవ్వక పోగా తమకు తెలియకుండా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబల్లి దయాకర్, సుధారాణి, బస్వరాజు సారయ్యను పార్టీలో చేర్చుకున్నారని వాపోయారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన బుడిగె శోభ, నల్లాల ఓదేలు, బాబు మోహన్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు. తమ తరువాత పార్టీలో చేరిన ఎర్రబెల్లికి ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వక పోవడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. మంత్రి కేటీఆర్ వల్ల తాము పార్టీలో చేరినా ఆయన ద్వారానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం మొదటి జాబితాలో తన పేరు లేకుండా అడ్డుకున్నది కూడా ఆయనేనని ఆరోపించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు రోజు తనకు కేటీతార్ ఫోన్ చేసి ఏ టికెట్ కావాలని, కుటుంబంలో ఎవరికి ఇవ్వాలని కోరాగా తానే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్టు సురేఖ తెలిపారు. భూపాలపల్లి టికెట్‌ను వేరొకరికి ఇచ్చే ఆలోచన ఉంటే తమ కుటుంబానికి ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. మరుసటి రోజు లీస్ట్‌లో వరంగల్ జిల్లాలోని 12 నియోజక వర్గాలకు గాను 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి తన ఒక్క టికెట్‌ను ప్రకటించక పోవడంతో ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. ఇందంతా కేటీఆర్ కుట్రేనని ధ్వజమెత్తారు. ఆయన కోటరీ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసే కుట్రులు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం కాదని, నాలుగు కోట్ల ప్రజలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల్లో విస్తృత ఆదరణ కలిగిన తనకు టికెట్ ఇవ్వక పోవడానికి కారణం ఏమిటో 24 గంటల్లో స్పష్టం చేయాలని, లేని పక్షంలో తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ఆమె హెచ్చరించారు. పూర్తి మెజారిటీతో నడుస్తున్న ప్రభుత్వాన్ని రద్దు చేయడం వంద శాతం తప్పేనని కొండ సురేఖ అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న కొండా సురేఖ