రాష్ట్రీయం

ముందుగానే ఓటర్ల జాబితా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు 2018 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారమే జరుగుతాయని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రజత్‌కుమార్ ప్రకటించారు. ఇటీవల జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం 2019 జనవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా, తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రెండు నెలల ముందే ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన మీడియా ప్రకటన జారీ చేశారు.
ఓటర్ల జాబితా సవరరణకు ఇటీవల జారీ చేసిన షెడ్యూల్‌ను రజత్ కుమార్ రద్దు చేశారు. కొత్తగా మరో షెడ్యూల్ ప్రకటించారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. స్థానిక సంస్థలైన గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజలకు ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచుతారు. కొత్తపేర్లను నమోదు చేసుకునేందుకు, ఏవైనా ఫిర్యాదులు ఉంటే చేసేందుకు సెప్టెంబర్ 10 నుండి 25 వరకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 15, 16 తేదీలలో గ్రామసభలు, స్థానిక సంస్థలలో సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి వివరాలను ప్రజలకు వెల్లడిస్తారు. ఎవరైనా ఎలాంటి అభ్యంతరాలనైనా చేస్తే వాటిని అక్టోబర్ 4 వరకు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 7 లోగా డటాబేస్‌ను అప్‌డేట్ చేయడంతోపాటు సప్లిమెంట్‌ను ప్రింట్ చేస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 8న వెల్లడిస్తామని రజత్ కుమార్ తెలిపారు. అంటే ఇటీవల జారీ చేసిన షెడ్యూల్ కంటే రెండు నెలల ముందే తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దు జరిగి 48 గంటలు గడవక ముందే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రజత్ కుమార్ శనివారం అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సిబ్బంది గురించి వివరాలు అడిగారు. శాంతిభద్రతల గురించి తెలుసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తామని అన్ని జిల్లాల కలెక్టర్లు
ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడైంది. షెడ్యూల్ ప్రకారమే ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలని, ఈ పని అత్యంత వేగంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చేయాలని ఆయన ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున ఉన్నతస్థాయి అధికారిక బృందం ఈ నెల 11 న హైదరాబాద్ వస్తోందని రజత్ కుమార్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు తెలిపారు. సెప్టెంబర్ 12 న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి అవసరమైతే జిల్లా కలెక్టర్లను పిలుస్తామని, అందుకోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. అంటే 12 వ తేదీన ఎలాంటి టూర్ ప్రోగ్రాంలను పెట్టుకోవద్దని కలెక్టర్లను పరోక్షంగా ఆదేశించారు. జిల్లాల్లో సిబ్బంది సంఖ్య, శాంతిభద్రతల పరిస్థితి, బందోబస్తు కోసం అందుబాటలో ఉన్న పోలీసు సిబ్బంది వివరాలు, ఎన్నికలు నిర్వహిస్తే ఆయా జిల్లాల్లో కల్పించాల్సిన వౌలక సదుపాయాలు, ఇతర అవసరాల గురించి తనకు ఒకటి రెండురోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
బదిలీలు
ఇలా ఉండగా ఎన్నికలకు సంబంధించి సమగ్ర నియమావళిని ప్రకటిస్తామని రజత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక మోమోను తాజాగా జారీ చేశారు. నియమావళి ప్రకారమే బదిలీలు చేయాల్సి ఉంటుందని, అవసరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ మెమోలో వెల్లడించారు.