రాష్ట్రీయం

టీ-కాంగ్రెస్‌కు పెరుగుతున్న వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీకి పోటీ చేసేందుకు టిక్కెట్లు ఆశించి భంగపడిన నాయకులు పార్టీ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురు వేస్తున్నారు. వరంగల్ తూర్పు టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖకు టిక్కెట్లు లభించలేదు. దీంతో ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన తప్పేమిటో 24 గంటల్లో చెప్పాలని అధిష్టానానికి సవాల్ విసిరారు. కొండ సురేఖ ఆమె భర్త కొండా మురళి రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ పార్టీ నాయకత్వంతో ఇమడలేకపోతున్నందున, ఆయన కూడా కారు దిగేసి తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. డీఎస్‌తో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 12న వారు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైందంటున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తనకు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ టిక్కెట్ కేటాయించాలని పట్టుబట్టారు. కానీ అందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం ససేమిరా అనడంతో రాథోడ్ కాంగ్రెస్‌లో చేరనున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. శుక్రవారం బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి డికే సమరసింహారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎంత మంది చేరుతారోనన్న ఊహగానాలు కొనసాగుతున్నాయి.