రాష్ట్రీయం

కుల సంఘాలతో జోగురామన్న చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: తెరాస టికెట్ ఖరారైన అపద్ధర్మ మంత్రి జోగురామన్న శనివారం వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తూ బిజీ బిజీగా గడిపారు. ఉదయం జోగురామన్న పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో సమావేశమై వాటిని సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేయాలని, నిధుల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి బీసి సంఘ భవన్‌లో ఏర్పాటు చేసిన బొందిలి, రాజ్‌పుత్, సంఘ సమావేశాల్లో పాల్గొని ఆయా కులస్తులకు తనవంతు సహకారం అందిస్తానని, సంఘ భవనాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మహాత్మాజ్యోతిబాఫూలే పేరిట జిల్లా కేంద్రంలో బీసి సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, రూ.5కోట్లతో నాలుగున్నర ఎకరాల్లో నిర్మిస్తామని అన్నారు. 27 కులాలకు భవన నిర్మాణాలు కూడా చేపడుతామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనే వెనకబడిన బీసి వర్గాలకు పెద్దపీట వేయడం జరిగిందని, బీసి కులాల్లో ఆత్మగౌరవం నింపేలా తనవంతు కృషి చేస్తానని అన్నారు. బీసి వర్గంలోని 27 కులాలకు సంబంధించి సత్ససంబంధాలు ఏర్పడేందుకు వేదిక ఏర్పాటు చేస్తామని అన్నారు. బీసివర్గంలోని 112 కులాల్లో ఇప్పటికీ 680 తెగలకు ఓబిసి గుర్తింపు లేదని, వీటికోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు.
గత పాలకులు చేతి వృత్తి కులాలను, వెనకబడి బీసి వర్గాలు పట్టించుకోలేదని, బీసి సంక్షేమ శాఖ మంత్రిగా ఆశించిన అభివృద్ధి సాధించామని అన్నారు. అనంతరం మంత్రి రామన్న కోలిపుర కాలనీలోని బంతిపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, కుల సంఘాల నేతలు మంత్రిని సన్మానించారు.