రాష్ట్రీయం

సాగర్-శ్రీశైలం లాంచీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 8: తెలంగాణ టూరిజం శాఖ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని శనివారం నాడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగించే ఈ టూరులో మొదటి రోజు హైద్రాబాద్ నుండి టూరిజం బస్సులో సాగర్ వచ్చి సాగర్ నుండి బయలుదేరి సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకొని రాత్రి అక్కడ బస చేసిన అనంతరం మరుసటి రోజు దైవదర్శన అనంతరం సాయంత్రానికి తిరిగి సాగర్ చేరుకుంటారు. దీనికి గాను భోజనం, బస, రవాణా చార్జీలు కలిపి 3వేల రూపాయలు నిర్ణయించారు. సాగర్ నుండి అయితే రవాణా చార్జీలు, భోజనం, బసతో కలిపి 2,200రూపాయలు, వన్‌వే అయితే వెయ్యిరూపాయలు నిర్ణయించారు. శనివారం నాడు 120మంది ప్రయాణికులతో ఈసంవత్సరం మొదటిసారి ఏర్పాటు చేసిన శ్రీశైలం ట్రిప్పును సాగర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గోపిరవి, టూరిజం వాటర్ ప్లూఇట్ జనరల్ మెనేజర్ బాలకృష్ణలు జెండా ఊపి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు తక్కువ రేటులో అన్ని సౌకర్యాలు కల్పించి టూర్ ఏర్పాటు చేస్తామని పర్యాటకుల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి బుధవారం, శనివారం శ్రీశైలానికి లాంచీ ట్రిప్పులను వేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో టూరిజం డిప్యూటి మేనేజర్ సత్యం, లాంచీస్టేషన్ మేనేజర్ హరియాలు ఉన్నారు.

చిత్రం..లాంచీని ప్రారంభిస్తున్న ఎఫ్‌డీఓ, టూరిజం అధికారులు