రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో అపచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 8: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు వాకిలి నుంచి గర్భాలయంలోనికి మలయప్ప స్వామి విగ్రహాన్ని తీసుకువెడుతున్న సమయంలో అర్చకుని కాలు మడతపడి విగ్రహం నేల తాకిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు ఎన్‌ఎకే సుందర వరద భట్టాచార్యులు సూచనలు మేరకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో వైఖానసాగమోక్తంగా లఘు సంప్రోక్షణ నిర్వహించారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఆలయంలోపల జరిగిన ఈ సంఘటనను మీడియాకు పొక్కితే వివిధ రకాల కథనాలు ప్రసారం చేస్తారని భావించిన టీటీడీ అధికారులు దీనిపై స్వయంగా టీటీడీ అధికారులే స్వయంగా మీడియాకు సమాచారాన్ని విడుదల చేశారు. శనివారం పుష్కరణి హారతి ఇచ్చేందుకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలప్ప స్వామిని ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరణి వద్దకు తీసుకు వచ్చారు. అనంతరం తిరిగి ఆలయంలోని బంగారు వాకిలి వద్దకు చేర్చారు. అక్కడ నుంచి అర్చకులు ఉత్సవ మూర్తులను గర్భాలయంలోని మూల విరాట్టు సన్నిధికి చేరుస్తారు. ఇందులో భాగంగా మలయప్ప స్వామి విగ్రహాన్ని ఒక అర్చకుడు చేతపట్టుకుని గర్భాలయంలోకి వెడుతున్న సమయంలో ఆయన కాలు మడతపడింది. దీంతో ఆయన చేతిలో ఉన్న మలయప్ప స్వామి విగ్రహం నేలను తాకింది. తక్షణం అర్చకుడు మలయప్ప స్వామిని తన చేతిల్లోకి తీసుకున్నాడు.
ఈ వ్యవహారం బంగారు వాకిలో ఉన్న సీసీ టీవీలో కూడా నమోదైంది. అయితే అపశృతి, అపవిత్రత అని ఈ సంఘటనపై ఎక్కడ మీడియా కథనాలను సృష్టిస్తుందోనని ఆలయంలో జరిగిన ఈ సంఘటనపై జేఈఓ శ్రీనివాసరాజు ఓ నిర్ణయం తీసుకుని మీడియాకు విడుదల చేశారు.