రాష్ట్రీయం

5కాదు 10శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 9: కాపు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రానికి పంపిన బిల్లును ఉపసంహరించుకుని, కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి, గవర్నర్ ఆమోదంతో వాటిని అమలు చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయమై ఇప్పటికే తాను సీఎం చంద్రబాబుకు లేఖ రాసానని, ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తన లేఖకు పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం సానుకూలంగా స్పందించని పక్షంలో కాపు సత్తా చాటేందుకు ఒక్క గర్జన చాలంటూ హెచ్చరించారు. కాపు సోదరులంతా ఒక్కటై గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లాలో ఒక్క గంట రోడ్డెక్కి గర్జించడం ద్వారా ప్రభుత్వానికి మన సత్తా చూపుదామని పిలుపునిచ్చారు. గతంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో అభ్యంతరాలు సరిచేయడంతో పాటు కొత్తగా నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం తదితర జిల్లాల్లో బలిజ కులస్తులను బిల్లులో చేర్చి అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దాటవేత ధోరణి
ప్రదర్శిస్తే గర్జించేందుకు ప్రతి కాపు సోదరుడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇంకా ఆలోచిస్తే కాపు జాతి కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం అంటే సెల్ఫీ దిగి వెళ్లిపోవడం కాదని, భయపడుతూ చేసే ఉద్యమాలు ఫలితాలివ్వవని స్పష్టం చేశారు. కాపు జాతిలో దమ్ము, ధైర్యం ఉందని నిరూపించాలంటే ధైర్యంగా ఉద్యమంలో ఎదురు నిలిచిపోరాడాలన్నారు. ఒక్క రోజు గర్జించి తడాఖా చూపితే ప్రభుత్వాలే దిగివస్తాయన్నారు. కాపు ఉద్యమంలో ఉన్న నేతలంతా ఏదో ఒక పార్టీకి చెందిన వారేనని, ఇదే ఉద్యమాన్ని దెబ్బతీస్తోందన్నారు. గుళ్లోకి వెళ్లేప్పుడు చెప్పులు విడిచినట్టే కాపు ఉద్యమంలో పార్టీలను పక్కనపెట్టి పోరాడేందుకు సిద్ధం కావలని పిలుపునిచ్చారు. గతంలో ఆమోదించిన కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును ఉపసంహరించుకుని, కొత్త డిమాండ్లను పొందుపరుస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పంపాలని సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో తమ విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించారు. ఇతర బీసీ కులాల డిమాండ్‌లను పరిష్కరిస్తూనే తమ డిమాండ్‌కు చట్టబద్దత కల్పించాలన్నారు. సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు తోట రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం