రాష్ట్రీయం

మంత్రుల సీట్లలో వైకాపా ఎమ్మెల్యేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 9: కడప నగరంలోని జడ్పీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకపోగా వ్యక్తిగత విమర్శలకు వేదికైంది. కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ హాలులో జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు కనిపించగానే అతడికి సమావేశంతో సంబంధం ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. అప్పటికీ ఇంకా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి సి.ఆదినారాయణరెడ్డి సమావేశానికి హాజరుకాకపోగా కలెక్టర్ సి.హరికిరణ్, జడ్పీ చైర్మన్ గూడూరు రవితో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపై ఆశీనులై ఉన్నారు. ఇంతలో గుజ్జల
తాను సమావేశానికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తూ వేదిక దిగి వచ్చి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ పక్కన కూర్చున్నారు. దీంతో అతడిని బయటకు పంపకపోతే తాము కూడా నిబంధనలకు విరుద్దంగానే వ్యవహరిస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాదరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు వేదికపైకి వెళ్లి మంత్రులకు కేటాయించిన సీట్లలో బైఠాయించారు. అయితే జడ్పీ చైర్మన్ గూడూరు రవి వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోయాడు. ఇక కలెక్టర్, ఇతరులు ప్రేక్షకపాత్ర వహించగా వేదిక దిగువనున్న వైసీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, ఆ పార్టీ జడ్పీటీసీ సభ్యులు కరవుకు సంబంధించిన ప్ల కార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేస్తూ నిల్చున్నారు. ఈ లోపు మంత్రులు సోమిరెడ్డి, ఆది సమావేశానికి హాజరై వేదిక పైకి చేరుకోగా కలెక్టర్ లేచి నిలబడగా ఆ సీట్లో మంత్రి ఆశీనులయ్యారు. ఇక మంత్రి సోమిరెడ్డి కూర్చునేందుకు సీటు లేకపోవడంతో ఆయన నిలబడే పదే పదే ఇది మంచి పద్ధతికాదన్నారు. సమావేశానికి అధ్యక్షుడైన జడ్పీ చైర్మన్‌కు ఇది అవమానకరమని, తమ పార్టీకి చెందిన చైర్మన్‌ను వారే అవమానించుకోవడం సబబుకాదని హితవు పలికారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు వేదిక మీద నుంచి కదల్లేదు. దీంతో మంత్రి సోమిరెడ్డి చేసేదేమీ లేక చాలా సేపు నిలబడే ఉన్నారు. ఇదిలా ఉండగా ఆప్కో చైర్మన్ గుజ్జల తాను సమావేశానికి రావడంలో తప్పేంటని ప్రశ్నించినప్పుడు వైసీపీ సభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. చివరకు గుజ్జల సమావేశం నుంచి బయటకు వెళ్లిపోగా వైసీపీ ఎమ్మెల్యేలు వేదికపై నుంచి దిగి వచ్చి తమ స్థానాల్లో కూర్చున్నారు. ఆ తర్వాత కూడా సమావేశంలో జిల్లాలోని కరవు పరిస్థితులపై ఏమాత్రం నిర్మాణాత్మక చర్చ జరపలేదు. కరవుకు ఉపశమనంగా ఏ చర్యలు చేయలేదని వైసీపీ సభ్యులు ధ్వజమెత్తగా, పట్టిసీమ ప్రాజెక్టుతో జిల్లాలోని రిజర్వాయర్లకు నీరు చేరి కరవు లేదని టీడీపీ సభ్యులు సమర్థించుకున్నారు. ప్రతి సందర్భంలో చర్చను వదిలి ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం, ఒక్కో సందర్భంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం కనిపించింది.

చిత్రం..కడప జడ్పీ సమావేశంలో వేదికపై కుర్చీ లేకపోవడంతో నిల్చునే
మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి