రాష్ట్రీయం

మాజీ సీఎం అంజయ్య సతీమణి మణెమ్మ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి మణెమ్మ ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ మరణించారు. 2008లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మణెమ్మ మృతి పట్ల అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మణెమ్మ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.