రాష్ట్రీయం

‘మైస్’ సిటీగా విశాఖ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 9: పర్యాటక రంగానికి సంబంధించి త్వరలో మైస్ సిటీగా విశాఖ మారనుందని ఏపీ పర్యాటక సాధికార సంస్థ (ఏపీటీఏ) సీఈవో హిమాన్షు శుక్లా వెల్లడించారు. విశాఖలో మూడు రోజులు జరిగిన భారతీయ టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ వార్షిక సదస్సు రాష్ట్ర పర్యాటక ప్రయోజనాలకు కొత్త ఊపిరులు ఊదింది. జాతీయ స్థాయి ప్రముఖ పర్యాటక టూర్ ఆపరేటర్లను ఏపీ వైపు ఆకర్షించడంలో సఫలమైంది. ఈనేపథ్యంలో ఆదివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మైస్‌కు పర్యాటక పరిభాషలో విస్తృతమైన అర్థం ఉందని చెప్పారు. ఎంఐసీఈ అంటే మీటింగ్స్, ఇనె్సంటివ్స్, కాన్ఫరెనె్సస్, ఎగ్జిబిషన్స్‌గా వ్యవహరిస్తారని వివరించారు. ఇలా నాలుగు విభాగాలు ఒకేచోట ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు ఒకేచోట జరిగేలా భారీ నిర్మాణాలు విశాఖలో రానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో ఈ నిర్మాణాలు ఉంటాయని, రెండు, మూడు సంస్థలు మైస్ సిటీలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో వీటికి సంబంధించి అవగాహన ఒప్పందాలు జరుగునున్నాయని తెలిపారు.
ఏపీ పర్యాటకంపై దేశవ్యాప్త చర్చ
విశాఖలో భారతీయ టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ వార్షిక సదస్సు రాష్ట్రంలోని పర్యాటక రంగం గురించి దేశవ్యాప్తంగా చర్చకు వేదికగా నిలిచింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కీలక పాత్ర వహించే టూర్ ఆపరేటర్లకు విశాఖ అందాలు, అమరావతి ప్రాముఖ్యత, తిరుమల క్షేత్రం విశిష్టతపై స్పష్టత వచ్చింది. ఈ సదస్సు గుజరాత్‌లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఏపీ పర్యాటక శాఖ రంగంలోకి దిగి విశాఖలో జరిగేలా పావులు కదిపి సఫలీకృతమైంది. మూడురోజులు జరిగిన సదస్సుకు హాజరైన పర్యాటక రంగ ప్రముఖులు ఏపీలో పర్యాటక రంగ పరంగా ఉన్న అవకాశాలు చూసి అశ్చర్యపోయారు. ఏపీ అందాలను తాము సద్వినియోగం చేసుకుంటామని ఐటీసీ చైర్మన్ నకుల్ ఆనంద్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఏ తరహా పెట్టుబడులు పెట్టాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని పంపుతామని కూడా ఆయన చెప్పారు.
కేరళ మాత్రమే పర్యాటకులకు జలస్వర్గంగా ఉండగా, కోనసీమ అందాల పైనా ఇక్కడ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. వచ్చే నెలలో 50 మంది జపనీయులను విశాఖ తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టూర్ ఆపరేటర్లు తెలిపారు. ఇకపై ఏపీ తమ ప్రాధాన్యతా రాష్ట్రంగా మారనుందని, గండికోటకు బెంగళూరు నుంచి పర్యాటకులను తీసుకొస్తామని ఆపరేటర్లు ప్రకటించడంతో అధికారుల కృషి ఫలించినట్లయింది.