రాష్ట్రీయం

కేసీఆర్ అవినీతి పాలన ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 9: ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన ముగిసింది. తెలంగాణలో రాబోయే ధర్మ పాలనకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని’ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మెదక్ టీఎన్‌జీవో భవన్‌లో ‘మా ప్రశ్నకు బదులేది, రచ్చబండ, రౌండ్ టేబుల్ సమావేశం’లో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో అణచివేత, అవినీతి, దౌర్జన్యకర పాలన జరిగిందని కోదండరాం ఈ సందర్భంగా ఆరోపించారు. 1200 మంది విద్యార్థుల బలిదానంతో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు. వచ్చిన తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగిందని కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రగతి నివేదన సభ ఒక రోజు, ఆశీర్వాద సభ మరోరోజు నిర్వహించిన కేసీఆర్ అధికంగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఇంజనీర్ ఆయనే, టీచర్ ఆయనే, వైస్ చాన్స్‌లర్ ఆయనే, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా కేసీఆర్‌యేనని ఎద్దేవా చేశారు. క్యాబినెట్‌లో మంత్రులు లేరు, మహిళా మంత్రులు లేరు. ఒకే ఒక్క సీఎం, అల్లుడు హరీష్‌రావు, కుమారుడు కేటీఆర్ మాత్రమే ఇంతకాలం శాసనసభను నడిపించారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో తెలంగాణలో జరిగిన అవినీతి ఎక్కడా చూడలేదని కోదండరాం అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో వంద శాతం అవినీతి చోటు చేసుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రణాళికబద్ధంగా లేకుండా కోట్ల రుపాయలు వ్యయపరిచారని ఆరోపించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు 77 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్లు రాలేదని ఆరోపించారు. అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి చోటు చేసుకుందన్నారు. దివంగత మంత్రి కరణం రాంచందర్‌రావు పైప్‌లైన్లతోనే ప్రజలకు నీళ్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో తెలంగాణకు నీళ్లు రాలేదుగానీ తెలంగాణను అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఉద్యోగాలు రాలేదు, సీపీఎస్ ఐఆర్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం పైసలు మింగడానికే ప్రాముఖ్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఐదు సంవత్సరాల పాలనకు పట్టం కడితే నాలుగేళ్లకే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిందన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కోదండరాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చిత్రాలు..మెదక్ టీఎన్‌జీవో భవన్‌లో టీజేఎసీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంకు విజ్ఞాపన పత్రం అందజేస్తున్న మెదక్ తపస్ ఉద్యోగుల సంఘం నాయకులు,
*రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం