రాష్ట్రీయం

ఆవాసమే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికీ ఆవాస కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. 2022 నాటికి 25 లక్షల ఇళ్లను నిర్మించాలనే సంకల్పంతో ఉన్నామని, ఎన్నికలలోపు18 లక్షల వరకు పూర్తి చేసి అర్హులకు అందజేస్తామన్నారు. గృహనిర్మాణ పథకాలపై సోమవారం శాసనసభలో లఘు చర్చ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం లెక్కల్లో మాత్రం 14 లక్షల ఇళ్లుకట్టినట్లు చూపించి రూ 4వేల కోట్లు దోచేసిందని ఆరోపించారు. రికార్డులన్నింటిలో సబ్సిడీ ఇచ్చినట్లు చూపారన్నారు. ఇప్పట్లో 25వేల రూపాయలుగా ఉన్న సబ్సిడీని తమ ప్రభుత్వం లక్షన్నర వరకు పెంచిందని, ఎస్సీ లబ్ధిదారులకు మరో 50 వేల రూపాయలు అదనంగా అందిస్తున్నామన్నారు. వైఎస్ ప్రభుత్వం 2.93 లక్షల మేర ఇళ్లను పూర్తిచేయకుండా వదిలేసిందని, వాటిని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం రూ 500 కోట్లు కేటాయించిందని తెలిపారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్కడ వీలైతే అక్కడ గృహనిర్మాణాన్ని మహాయజ్ఞంగా చేపట్టామన్నారు. పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రిజిస్ట్రేషన్లు సులభతరంచేసి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. సిమెంట్‌ను రూ 230కే రవాణా అయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పేదవాళ్లకు ఓ స్థిరాస్థిని అంద జేయాలనే లక్ష్యంతో యూనిట్ ధరను పెంచి ప్రభుత్వం సబ్సిడీని భరిస్తోందని తెలిపారు. గృహసముదాయాల్లో వౌలిక వసతుల కల్పన, రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లస్థలాలులేని చోట ఎకరం కోటి రూపాయలకు కొనుగోలుతో భూ సేకరణ జరుపుతున్నామని, జీ ప్లస్ వన్, టు, త్రి ఎక్కడ ఎవరికి ఏది అవసరమో వారి స్తోమతును బట్టి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ 500 కోట్లు భూ సేకరణకు కేటాయించామని, పట్టాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విశాఖపట్నంలో 60 వేల పట్టాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. పసుపు, కుంకుమ పథకం ద్వారా పైసా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నామని, రూ 300 కోట్లతో లెవెలింగ్, ఆధునిక వసతుల
కల్పన చేపట్టామన్నారు. ఈ ఏడాది లక్షా 76వేల 309 ఇళ్లకు గాను 56వేల 765 పూర్తి చేశామన్నారు. ఎస్సీలకు 50వేలు, ఎస్టీలకు లక్ష రూపాయల వరకు సబ్సిడీని పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటటంలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకాలకు పొంతన లేదన్నారు. నాలుగు దశల్లో జియో ట్యాగింగ్, ఆధార్ లింకేజ్‌తో పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయటంతో పాటు ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల్లో సంతృప్తిస్థాయిని తెలుసుకుంటున్నామని చెప్పారు. గ్రామీణ గృహనిర్మాణ పథకంలో భాగంగా గత నాలుగేళ్లలో 6లక్షల 45వేల 564 ఇళ్లకు రూ 6వేల 857 కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే 3 నెలల్లో ఐదు లక్షల ఇళ్లు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఇళ్లు యూనిట్ ఖరీదు లక్షా 72వేలు కాగా అందులో రూ 78వేలు కేంద్రం, మరో 42వేల రూపాయలు రాష్ట్రం వాటాగా ఉందన్నారు. రాష్ట్రం మొత్తంగా 20లక్షల 98వేల మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రతిపాదనలు పంపితే కేవలం లక్షా 20వేల 934 ఇళ్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసిందన్నారు. అర్బన్ హౌసింగ్ కింద పీఎంఏవై, ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణ పథకాలను అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు 7లక్షల 38వేల 245 ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. జీ ప్లస్ టు, త్రీ కింద 5లక్షల 7లే 219, వ్యక్తిగతంగా మరో 2లక్షల 31వేల 30 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 4లక్షల 54వేల 606 ఇళ్లు టెండర్ దశలో ఉన్నాయని, 75వేల 580 ఇళ్లకు స్లాబ్ పూర్తయిందన్నారు. వచ్చేనెలలో 78వేల ఇళ్లకు గృహప్రవేశాలు జరుపుతామని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్నాయని తిరుపతి అవుటర్ రింగ్‌రోడ్డులో నిర్మించిన ఇళ్లను దెయ్యాల కొంపలుగా మార్చారని ధ్వజమెత్తారు. రాజీవ్‌గృహకల్ప కింద నాసిరకం ఇళ్లను నిర్మించారని ఆరోపించారు. తిరుపతితో పాటు విజయవాడ జక్కంపూడిలో రూ 100 కోట్లతో ఆ ఇళ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యునికి లాభం చేకూరే విధంగా స్థిరాస్థి కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గేటెడ్ కమ్యూనిటీ కంటే మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, నాణ్యతో ఎక్కడా రాజీపడకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఇళ్లను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్, రూరల్ గృహనిర్మాణాలను రూ 60వేల కోట్లతో చేపట్టామన్నారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ పరిధిలో రెండులక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు 380 కోట్లు మంజూరు చేశామనన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షన్నర మంజూరు చేస్తుంటే మరో లక్షన్నర వెరసి మూడు లక్షలతో శాశ్వత గృహవసతి కల్పిస్తున్నామని తెలిపారు. జర్నలిస్టులకు రూ 100 కోట్లు కేటాయించామని రాజధాని, రూరల్ పరిధిలో అర్హులైన వారికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని వెల్లడించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం 7వేలు మాత్రమే మంజూరు చేస్తోందని రాష్ట్రం మరో 8 వేలు అదనంగా భరించి మొత్తం రూ 15వేలతో ఇప్పటి వరకు 33లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు.