రాష్ట్రీయం

ఖైరతాబాద్ వినాయకుడికి 25 మీటర్ల చేనేత శాలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 10: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో చేనేత పార్కులో 25మీటర్ల పొడువు గల చేనేత శాలువను కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి కళాత్మకంగా రూపొందించారు. హైద్రాబాద్ ఖైరాతాబాద్‌లోని ప్రతిష్ఠించే భారీ వినాయకుడికి చేనేత శాలువను సమర్పించేందుకు పార్క్ యాజమాన్యం ఈ శాలువను పంపించనున్నారు. ఈ చేనేత శాలువను వినాయకుడు లడ్డూలు, శివలింగం, రామబాణం, ఓంకారం, త్రిశూలం, కమలం, స్వస్తిక్, పూర్ణకుంభం, శంకుచక్రం, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అక్షరాల గుర్తులతో తయారు చేశారు. ఈ శాలువ తయారీకి కర్నాటి విష్ణు డిజైనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్క్ యాజమాన్యం కడివేరు దేవేందర్, ప్రతినిధులు భారత లవకుమార్, కె.రాములు, బి.పురుషోత్తం, కృష్ణ, ఇటిపోలు గోవర్దన్, కె.అంజయ్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఖైరాతాబాద్ వినాయకుడి కోసం రూపొందించిన చేనేత శాలువను ప్రదర్శిస్తున్న పార్క్ యాజమాన్యం