రాష్ట్రీయం

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంట్రాక్టు ఉద్యోగులే అన్ని విధులను నిర్వహిస్తున్నా వీరికి నామమాత్రపు వేతనాలే ఇస్తున్నారని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఎన్‌ఎమ్‌ఆర్, కంటింజెంట్, డైలీవేజ్, టైం స్కేల్ వర్కర్స్‌ను కూడా రెగ్యులరైజ్ చేయాలని వారి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సోమవారం సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలో మధు కోరారు. రాష్ట్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో 3 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం అమలుకు నోచుకోలేదని, 4 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు.