రాష్ట్రీయం

మా భవిష్యత్ బంగారం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: మెరుగైన ప్యాకేజీతో తమ భవిష్యత్తుకు బంగారుబాట వేశారని గన్నవరం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు ముఖ్యమంత్రిని కలుసుకుని గన్నవరం విమానాశ్రయ రన్‌వే విస్తరణకు భూములిచ్చి తాము కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రన్‌వేకు భూములిచ్చిన 700 మంది రైతులను సీఎం అభినందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో పయనింప చేసేందుకు అహర్నిశలు కృషిసల్పుతున్నారని వృద్ధరైతులు ఆశీర్వదించారు. రాజధాని అమరావతి నిర్మాణం తమకు అమితానందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.