రాష్ట్రీయం

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధికార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ యేడాది అధికమాసం ఉన్న కారణంగా ఈనెల 13నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజాసామగ్రిని శుద్ధిచేసినట్లు తెలిపారు.
ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తి అయిన తరువాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఇన్‌చార్జ్ సీవీఎస్‌ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం 12వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
13న ధ్వజారోహణం
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 13వ తేదీ సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తరువాత రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
13వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, 14వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి పెద్దశేష వాహనం, 15న ఉదయం సింహవాహనం, రాత్రి హంసవాహనం, 16న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 17న ఉదయం మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనం, 18న ఉ. హనుమంత వాహనం, సా. 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణరథం, రాత్రి గజవాహనం, 19న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 20న ఉ. 7.30 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 21న ఉ. 7.30 నుంచి 10 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 7 నుంచి 9 వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.