రాష్ట్రీయం

మేం బానిసలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి పన్నులు వసూలుచేస్తూ వాటి హక్కులను కాలరాస్తోందని ముఖ్యమంత్రి చంద్ర బాబు ధ్వజమెత్తారు. ‘రాజధాని అమరావతి నిర్మాణం’పై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాజధానిలో 27వేల మంది రైతు కుటుంబాలు స్వచ్ఛందంగా స్పందించి 34వేల ఎకరాలు త్యాగం చేశారని తమ ప్రభుత్వ విశ్వసనీయతే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే కేంద్రంతో సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం అమరావతి నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.40వేల కోట్ల రూపాయల ఆస్తి పెట్టుబడిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వక పోతే అమరావతి ఊహాగానాలకే పరిమితమయ్యేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా అహ్మదాబాద్‌లో సాధించింది ఏమీలేదని, ఉమ్మడి రాష్ట్రంలో తమ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మించిందన్నారు. అభివృద్ధి తనకోసం.. తన పార్టీకోసం కాదని, ఈ రోజు వేసే ప్రతి అడుగు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని పేర్కొన్న చంద్రబాబు ‘రాజధాని నిర్మాణం ప్రధానికి గర్వకారణం కాదా’అని ప్రశ్నించారు. దగాపడిన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే భావనతో పొత్తు పెట్టుకున్నామని, తెలంగాణలో పొత్తు ఉండదని చెప్పినప్పుడే మోదీ నమ్మకద్రోహంపై అనుమానం కలిగిందన్నారు. రాజధాని నిర్మాణం జరిగితే కేంద్రానికి పన్నుల రూపంలో వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇప్పటి వరకు రూ 48వేల కోట్లు ప్రభుత్వపరంగా, మరో 50 వేల కోట్లు పెట్టుబడి నుంచి సుమారు 6వేల కోట్ల మేర కేంద్రానికి పన్నులు చెల్లించారన్నారు. ‘మేం పన్నులు కట్టాలి.. పెత్తనం మీరు చేయాలా’అని కేంద్రాన్ని ప్రశ్నించారు. హైకోర్టు విషయంలో కేంద్రం కుతంత్రాలు బహిర్గతమయ్యాయని, తెలంగాణతో వైరుధ్యం పెంచి రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలోనే హైకోర్టు పెడతామని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం దుర్మార్గమన్నారు. రూపాయి ఖర్చుపెట్టని రాజధానికి నిధులెలా వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. నిధులు మంజూరు చేయకుండా, రాజధానికి అవసరమైన రైల్వేలైన్‌కు అనుమతివ్వకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు లక్షా పదివేల కోట్లు ఖర్చుపెట్టారని, కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేస్తున్న నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. కేంద్రంతో పాటు ప్రధాన ప్రతిపక్షం రైతుల్ని రెచ్చకొట్టి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయటం ద్వారా కుట్రకు తెరలేపిందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పదేళ్ల తరువాత తెలుగుప్రజలు గర్వపడేలా చరిత్రను తిరగరాస్తామని స్పష్టం చేశారు. అమరావతి అంటే ప్రపంచ నగరాల సరసన చేరే విధంగా తీర్చిదిద్దుతామని కసితో పనిచేస్తామని తేల్చి చెప్పారు. ఈ కృషిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు భూమిలేని నిరుపేదల కోసం 5024ప్లాట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో 193 కిలోమీటర్ల రహదార్లు, కృష్ణానదిపై 9 వంతెనలు, 7 ఐలండ్‌లతో 4072 ఎకరాల్లో పర్యావరణ పర్యాటక ప్రాంతంగా పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 65 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏర్పాట య్యాయని స్టార్టప్ ఏరియాగా 1691 ఎకరాలను సింగపూర్ సంస్థలు అభివృద్ధి చేస్తాయన్నారు. మొత్తం 53వేల 622 ఎకరాలకు గాను 16 వేల ఎకరాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. మూడు వందల కిలోమీటర్ల మేర పచ్చదనం విస్తరింప చేస్తామన్నారు. శాసనసభ భవనాలను ఐకానిక్‌గా నిర్మిస్తున్నామని, ఐదు టవర్లలో బౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు భవనాలు నిర్మితమవుతాయని చెప్పారు. మరో ఐదువేల ఎకరాల భూమిని భవిష్యత్ అవసరాలకు రిజర్వు చేశామన్నారు. నూరేళ్ల చరిత్రను ప్రామాణికంగా తీసుకుని కొండవీటి వాగు ఇతర పర్యావరణ అంశాలను బేరీజువేసి రాజధాని నిర్మాణం చేపట్టామన్నారు. రాబోయే కాలంలో 50వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు అందించే దిశగా రాజధానిలో కొండవీటి వాగు రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాజధాని భవన నిర్మాణం నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తిలేదన్నారు. నిధులు ఇవ్వకపోగా వైసీపీతో కలసి బీజేపీ వవిషయం చిమ్ముతోందని తెలుగుజాతి కేంద్రం కాళ్లదగ్గర మోకరిల్లే విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల సహనంతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కేంద్రం సహకరించకపోయినా వైసీపీ అడ్డుపడినా దృఢ సంకల్పంతో ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. డిజైన్లు సింగపూర్‌లో ఉన్నాయని అమిత్‌షా కళ్లకు అందని భవనాలు వెలుస్తాయని ఈ కృషిలో ఐదుకోట్ల తెలుగు ప్రజలు పాలు పంచుకోవాలని ఉద్ఘాటించారు.