రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరి కిడ్నాప్, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయిపూర్, సెప్టెంబర్ 11: తమ వివరాలను పోలీసులకు అందిస్తూ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఇద్దరు గ్రామస్తులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. దంతేవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ తెలిపిన వివరాల ప్రకారం ఆయుధాలు ధరించి వచ్చిన కొందరు నక్సల్స్ బచేరి పట్టణంలోని హంగాకర్మ (35), భీమాముచకి (35)లను వారం క్రితం కిడ్నాప్ చేశారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు అడవులు, ఇతర ప్రాంతాల్లో వారికోసం వెతికారు. అయితే కిడ్నాప్‌నకు గురైన ఇద్దరూ సోమవారం బచేలి రైల్వేస్టేషన్ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. పదునైన ఆయుధంతో వారిని గాయపరచడమే కాక, వారి గొంతు కోసిన ఆనవాళ్లు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. సంఘటనా స్థలంలో మావోయిస్టులు వదిలిన ఒక కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించినందున వీరికి ఈ గతి పట్టించామని వారు అందులో పేర్కొన్నట్టు చెప్పారు