రాష్ట్రీయం

తిరుమలకు 160 మంది అన్నదాతల సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, సెప్టెంబర్ 11: ప్రకృతి వైపరీత్యాల నుండి తమ పంటలను కాపాడాలని వేడుకుంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన 160 మంది రైతులు మంగళవారం సైకిళ్లపై తిరుమల యాత్రకు బయలుదేరారు. గ్రామంలోని శ్రీ బాలవినాయక ఆలయం, శ్రీ బాల త్రిపురసుందరీ దేవి సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అన్నదాతలు అనంతరం 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా బయలుదేరి వెళ్లారు. టీడీపీ యువనేత బండారు సంజీవ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా పసుపు తోరణాలతో, గోవింద నామ స్మరణతో మార్మోగింది. తొమ్మిదేళ్ల క్రితం అయిదుగురు రైతులతో ప్రారంభించిన ఈ ప్రస్థానం ఈ ఏడాది 160 మందికి చేరింది. ఈ ఏడాది ఉండమట్ల సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగుతోంది. సుమారు 650 కిలోమీటర్లు మేర జరిగే ఈ యాత్ర అయిదు రోజులపాటు కొనసాగి ఈ నెల 16వ తేదీ ఉదయం తిరుమలకు చేరుకుంటుంది. అదే రోజు శ్రీవారి దర్శనం చేసుకోనున్నట్లు అన్నదాతలు తెలిపారు.