రాష్ట్రీయం

బాల్క సుమన్‌పై హత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ంచిర్యాల, సెప్టెంబర్ 12: చెన్నూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్‌కు ఇవ్వడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్నికల ప్రచారానికి సుమన్ బుధవారం శ్రీకారం చుట్టి ఇందారం నుంచి ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఇందారం వద్దకు చేరుకున్న బాల్క సుమన్‌ను ఆ ప్రాంత ప్రజలు నిలువరించారు. ఓపెన్ కాస్టును నిర్మించవద్దని డిమాండ్ చేస్తూ, కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య తీవ్రస్థాయిలో నిరసనకు దిగాడు. పెట్రోల్ బాటిల్ తీసుకొని ఓదెలుకు టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశాడు. తొలుత తనపై పెట్రోల్ పోసుకొని, అనంతరం సీసాను సుమన్‌పైకి విసిరాడు. దీనిని గమనించిన గన్‌మెన్‌తోపాటు స్థానిక పోలీసులు, కార్యకర్తలు ఆ బాటిల్‌ను తిప్పి కొట్టారు. అది వేగంగా వచ్చి, మహిళలు పట్టుకున్న మంగళ హారతిపై పడడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో గట్టయ్యతోపాటు శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్‌సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రచార ర్యాలీలో జరిగిన మంటల్లో గాయపడిన వారిలో చేకూరి సత్యనారాయణ రెడ్డి, జక్కుల వెంకటేష్, రాజేశ్వరి, సుంకరి విమల, నిఖిత, తొగరి శ్రీనివాస్, భాస్కర్ల శ్రీకాంత్, జైనుద్దీన్, శ్రీనివాస్, జక్కుల గంగామణి, చుంచు రాజయ్య, మీడియా కవరేజ్‌కు వెళ్లిన స్ట్ఫా ఫోటోగ్రాఫర్స్ బొప్పు హనీష్, మహేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్ ఉన్నారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుండి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో 15 మందిని మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

వెలువెత్తిన నిరసనలు
చెన్నూర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్‌ను టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖరారు చేసినప్పటి నుండి నిరసనలు వెలువెత్తుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలు అనుచరులు నియోజకవర్గంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మంగళవారం స్వయంగా ఓదెలు స్వీయ గృహా నిర్బంధంలోకి వెళ్లి నిరసన తెలిపారు. బుధవారం బాల్క సుమన్ పథకం ప్రకారం ఇందారం నుండి ప్రచారాన్నిప్రారంభించి, చెన్నూర్ నియోజకవర్గం కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆత్మహత్యా, హత్యయత్నాలు జరిగాయి. సుమన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను, ఓపెన్ కాస్టు అందోళనకారులను దాదాపు 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుమన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు గట్టయ్య పెట్రోల్ బాటిల్ పట్టుకొని వెళ్లడం వెనుక కొంతమంది కుట్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బాల్క సుమన్‌పై పథకం ప్రకారమే హత్యకు కుట్రజరిగిందనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
ఓదెలు అనుచరుల పనే
చెన్నూర్‌లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే అనుచరులు బుధవారం తనపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారని, హత్య చేసేందుకే వారు కుట్ర పన్నారని పెద్ద పల్లి ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు. ఈ సంఘటనలో కార్యకర్తలు, పోలీసులే తనను రక్షించారని అన్నారు. చెన్నూర్ టికెట్ కేసీఆర్‌ను అడగలేదని, కేసీఆర్ మాటకు కట్టుబడి పోటీ చేస్తున్నానని అన్నారు. ఎన్ని ఆరాచకాలు సృష్టించినా పోటీ విరమించుకునేది లేదని స్పష్టం చేశారు.