రాష్ట్రీయం

అధికారంలోకి రాగానే కేసీఆర్ అంతుచూస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అంతు చూస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన ముస్లిం మైనార్టీ గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేత కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై బనాయిస్తున్న అక్రమ కేసులను మరచిపోమని, అందుకు ప్రతికారం తీర్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన నైతిక బాధ్యతను విస్మరించిన డీజీపీ మహేందర్‌రెడ్డి కేసీఆర్‌కు తొత్తుగా మారాడని ధ్వజమెత్తారు. మనుషుల అక్రమ తరలింపు కేసులో అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కన్నా కేసీఆర్, హరీష్‌రావులే మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారని వెల్లడించారు. 2004 సంవత్సరం నాటి కేసును ఇప్పుడెందుకు తిరగతోడారని ప్రశ్నించారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కావడం, నేటి గులాంనబీ ఆజాద్ సభ సక్సెస్ అవుతుందనే భయంతో జగ్గారెడ్డిపై కేసులు బనాయించారని ఆరోపించారు. జగ్గారెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ వర్గానికి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీసారు. కాంగ్రెస్ పార్టీ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లతో ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారని స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి చెంచాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఎంఐఎంతో పొత్తు ఉందంటూనే కేంద్రంలో బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేసారు. కేసీఆర్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టి తగిన గుణపాఠం చెబుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు జనాదరణ పెరుగుతుందని, తప్పకుండా ప్రజలు పట్టం కడతారన్నారు. జగ్గారెడ్డిని జైల్లో పెట్టించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఆయనకు, ఆయన కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని త్వరలోనే బయటకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేసారు. నియోజకవర్గంలోని ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, సురేష్ షెట్కార్, శశిధర్‌రెడ్డి, ఫకృద్దీన్, నిర్మలాజగ్గారెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.