రాష్ట్రీయం

షార్ నుంచి మరో ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 16న పోలార్ శాటిలైట్ వాహక నౌక-సీ 42(పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగానికి సంబంధించి రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. బుధవారం రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియను పూర్తిచేసి దానిచుట్టు ఉష్ణకవచాన్ని (హీట్‌షీల్డ్) అమర్చి పలు పరీక్షలు నిర్వహించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) 14న డాక్టర్ ఎస్‌ఎం సురేష్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో శాస్తవ్రేత్తలందరూ పాల్గొని ప్రయోగం పై చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్ పాండ్యన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు (ఎల్‌ఏబి) సమావేశమై సుదీర్ఘంగా చర్చించినంతరం ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. సీ-42 రాకెట్ ద్వారా యూకేకు చెందిన నోవాసర్-1, ఎస్1-4 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 33గంటల ముందు అనగా ఈ నెల 15న 1:37గంటలకు ప్రారంభించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని సజావుగా జరిగి వాతావరణం అనుకూలిస్తే ఇస్రో నిర్దేశించిన సమయానికే ఈ నెల 16న రాత్రి 10:07 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 42 రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగం విజయవంతమైనే వాణిజ్య రంగంలో భారత్ మరో ముందడుగు వేస్తుంది.