రాష్ట్రీయం

వాకౌట్ కూడా చేయనివ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో నిరసనగా వాకౌట్ కూడా చేయలేని విచిత్ర పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు ఎదురైంది. వాకౌట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం తీవ్ర ఆందోళనకు దిగింది. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తర కార్యక్రమ సమయంలో ఈ వివాదం తలెత్తింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి నిధుల కేటాయింపునకు సంబంధించి అత్తర్ చాంద్ బాషా, వై సాయి ప్రసాద్ రెడ్డి, అంజాత్ భాషా షేక్ బెపారి తదితరులు మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వం సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొంటూ వాకౌట్‌కు అవకాశం ఇవ్వలేదని వైకాపా నేతలు ఆరోపించారు. ఒక పక్క ఈ ప్రశ్నకు మైనార్టీ సంక్షేమ మంత్రి పల్లెరఘునాధరెడ్డి చెబుతుండగానే వైకాపా సభ్యులు తమ అభ్యంతరం లేవనెత్తారు. అయితే తదుపరి ప్రశ్నను స్పీకర్ వెంటనే చేపట్టడంతో వైకాపా సభ్యులు తమ నిరసన తెలిపారు. సభ గందరగోళంలో ఉండటంతో వెంటనే స్పీకర్ సభకు పది నిమిషాల పాటు విరామం ఇచ్చారు. అనంతరం సభ సమావేశం కాగానే స్పీకర్ స్థానంలో ప్యానల్ స్పీకర్ ప్రభాకర్ చౌదరి కూర్చుని జీరో అవర్‌ను చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆశీనులైన తర్వాత వైకాపా సభ్యులు పోడియం ముందుకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేసి, అనంతరం పోడియం వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. వైకాపా సభ్యులను ఉద్ధేశించి స్పీకర్ మీ ప్రాబ్లం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ సబ్జెక్టుపై నిరసన తెలిపే అవకాశాన్ని తమకు కల్పించాలని అన్నారు. తాము చేతులు ఎత్తుతున్నా ఇటువైపు చూడకుండా మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వడం సరైంది కాదని అన్నారు. కనీసం రేపటి నుండైనా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం హక్కులను కాలరాస్తున్నారని, ప్రభుత్వం అబద్దాలు చెబితే తమకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వరా అని అన్నారు. మైనార్టీ సంక్షేమం, మహిళా సాధికారతపై తమ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తి కలిగించలేదని అన్నారు. దీనిపై నిరసన తెలిపే హక్కు తమకు ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దీంతో సభ్యులు వెనక్కు వెళ్లాలని సభ సజావుగా సాగేందుకు తోడ్పడాలని ఆర్ధిక మంత్రి యనమల కోరారు. దాంతో యనమల విజ్ఞప్తిని అంగీకరించిన విపక్ష సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నారు.
ఎందుకు చేస్తున్నారో చెప్పాలి
ప్రతిపక్ష సభ్యులు తాము ఎందుకు నిరసన తెలుపుతున్నారో చెప్పాలని ఏడు సమావేశాల్లో ఎవరు ఎంత సేపు మాట్లాడారో రికార్డులున్నాయని చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. విపక్షానికి అవసరానికి మించి అవకాశాలు ఇస్తున్నారని దానిని వారు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏదైనా ఉంటే మాట్లాడాలే తప్ప ఏమీ లేకుండా నిరసన తెలపడం ఏమిటని అన్నారు.
ప్రతిపక్ష పార్టీకటి అన్ని రకాలుగా అవకాశాలు కల్పించినా, సవ్యంగా ఉపయోగించుకోవడం లేదని, పనీపాట లేకపోతే లోటస్ పాండ్‌లో కూర్చోవాలే తప్ప అసెంబ్లీని అడ్డుకుంటే ఎలా అని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
దామాషా ప్రకారమే సమయం: స్పీకర్
ఏదైనా ఒక అంశంపై చర్చ జరుగుతున్నపుడు సభలో ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారేమోనని చుట్టూ చూస్తుంటానని, ఒక ప్రశ్నపై చర్చ పూర్తయిన అనంతరం మరో ప్రశ్నకు వెళ్లినా మళ్లీ మొదటిదానిపైనే చర్చ జరుపుతామని అనడం సరికాదని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఎన్నో సమస్యలపై విపక్షం వాకౌట్ చేసిందని, అజెండా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా తనపై ఉంటుందని, సభ నిర్వహణకు నిబంధనలు, సంప్రదాయలు, పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాలని స్పీకర్ పేర్కొన్నారు. సభాధ్యక్షుడిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. తాను పద్ధతి ప్రకారం వెళ్తే ఇపుడొస్తున్న సమయం కూడా విపక్షానికి దామాషా పద్ధతిలో రాదని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.