రాష్ట్రీయం

బలపడుతున్న మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొవడానికి వివిధ పార్టీలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపియేతర పార్టీలను కలుపుకుని పోవాలన్న పట్టుదలతో పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. తొలుత ఆ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన సంగతి తెలిసిందే. దీనికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత గురువారం ఆ రెండు పార్టీల నేతలు ఉత్తమ్, రమణ సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో జరిపిన చర్చలు ఫలించాయి. ఇలాఉండగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కే. దిలీప్ కుమార్, మరో నేత యోగి ప్రభృతులు గురువారం ఉత్తమ్, రమణను కలిసి మహాకూటమిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మహాకూటమిలో చేరేందుకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అంగీకరించినందుకే తాము వచ్చామని వారు తెలిపారు. నిజానికి టీజేఎస్ మహాకూటమిలో చేరుతుందో లేదోనన్న అనుమానాలు టీడీపీ, కాంగ్రెస్ నేతలకు ఉండేది. ఇక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్), సీపీఎం, జన సేన తదితర పార్టీలతో మహాకూటమి నాయకులు చర్చించాలనుకుంటున్నారు.