రాష్ట్రీయం

మోదీ, కేసీఆర్‌ను తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అందుకు కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును తరిమికొట్టాలని ఏఐసిసి లీగల్ సెల్ చైర్మన్ వివేక్ కే. తంఖా న్యాయవాదులకు పిలుపునిచ్చారు. పీసీసీకి అనుబంధ విభాగమైన లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి అధ్యక్షతన శనివారం 3రక్షించు తెలంగాణ - మార్పు తెలంగాణ2 పేరిట ఆర్టీసీ కళ్యాణ మండపంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన తంఖా ప్రసంగిస్తూ మార్పుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఇప్పుడు మార్పు చేసుకోకపోతే తర్వాత బాధ పడతారని తెలిపారు. కాబట్టి న్యాయవాదులు ఏకం కావాలని సూచించారు. స్వాతంత్య్ర సంగ్రామం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ అనేక పోరాటాల్లో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని అన్నారు. మార్పు రాకుండా ఎవరూ అడ్డుపడలేరని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి నేరస్థులు రాకూడదని తంఖా అన్నారు. అన్ని పార్టీలూ మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని హితవుపలికారు. ఓటర్ల జాబితాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాబితా సక్రమంగా లేకపోతే ఎన్నికల నిర్వహణ వృథా అవుతుందని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్‌లో 15 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉందని, దీనిపై ఆరా తీయగా ఆ పార్టీ అక్కడ నకిలీ ఓట్లను 70 లక్షలు చేర్చినట్లు తేలిందనీ అన్నారు. రాజస్థాన్‌లో 42 లక్షల ఓట్లను చేర్చారని ఆయన తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టులో ఈ నెల 20న విచారణ జరగనున్నదని ఆయన చెప్పారు.

న్యాయవాదుల రక్షణ చట్టం
న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాల్సిన అవసరం ఉందని తంఖా అన్నారు. అదేవిధంగా జర్నలిస్టులకూ చట్టం అవసరమని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో న్యాయవాదుల రక్షణ కోసం స్పష్టమైన హామీలు ఇవ్వాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోరాదని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా న్యాయవాదులు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారని అంటూ పార్లమెంటులో 50 శాతం మహిళా ఎంపీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువ న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని, ఐక్యంగా ఉండాలని సూచించారు. న్యాయవాదులు సభ నిర్వహిస్తే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి, సభకు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో పెద్ద మోదీ, రాష్ట్రంలో చిన్న మోదీగా ఉన్న కేసీఆర్‌ను ఓడించాలని ఆయన కోరారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయల ప్రకటనలిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మంచి పనులే ప్రచారాస్త్రాలు అవుతాయి తప్ప ప్రకటనలు కాదని తంఖా వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ లీగల్ సెల్, హెచ్‌ఆర్ కార్యదర్శి విపుల్ మహేశ్వరి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, జర్నలిస్టు శివప్రసాద్‌రెడ్డి, న్యాయవాదులు అనంతసేనా రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి, ఇతర నాయకులు ఇందిర, శ్యాంమోసన్, పి. నర్సింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా పాల్గొన్నారు.