రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌పై సమర శంఖారావం పూరిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ యుద్ధంలో విజయం మాదే *తెలంగాణలో మాదే అధికారం
* రాష్ట్ర ప్రగతి మాతోనే సాధ్యం * రాహుల్‌బాబా కాంగ్రెస్‌ను గెలిపించలేరు
* హైదరాబాద్‌లోని రోహింగ్యాలను సీఎం వెనక్కి పంపిస్తారా? లేదా?
* పాలమూరు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 15: టీఆర్‌ఎస్‌తో సమరం మొదలైందని, ఈ యుద్ధంతో విజయం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఖాతాలోకి తెలంగాణ రాబోతుందనీ, దీనిని ఎవరూ అపలేరని వ్యాఖ్యానించారు. రాహుల్‌బాబా, కేసీఆర్ లాంటివారు బీజేపీ శక్తిని అడ్డుకోలేరని అమిత్ షా అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల శంఖారావం సభకు హాజరయ్యారు. ఢంకా మోగించి, శంఖం పూరించిన ఆయన భారీ బహిరంగసభలో అశేష ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సైతం బీజేపీ కైవసం చేసుకోబోతున్నదన్న భయం కేసీఆర్‌ను వెంటాడుతున్నదని అన్నారు. ఈకారణంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలు ఒకే సమయంలో జరిగితే ఓడిపోతానని భావించిన కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని అంటూ, నవంబర్ లేదా డిసెంబర్‌లోనే ఓటమికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవరూ అపలేరని అన్నారు. టీఆర్‌ఎస్‌పై బీజేపీ యుద్దం ప్రకటించిందనీ, ఇందులో విజయడంఖా మొగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర దినోత్సవమని వ్యాఖ్యానించారు. ఈ విముక్తి దినోత్సవాన్ని జరపడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందుకే వెనకాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎంఐఎం నేతలకు భయపడే ఉత్సవాలు జరపడం లేదని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ఆయన 2018లో అయిన దళితుడిని సీఎం చేస్తారో లేదో బహిరంగంగా చెప్పాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ మీదుగా వచ్చిన రోహింగ్యాలు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారని, వారిని కేసీఆర్ పంపిస్తారో లేదో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 నుండి 2018 మధ్యలో దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పారాజయం పాలు అయ్యిందని ఆయన గుర్తుచేశారు. రాహుల్‌బాబా కాంగ్రెస్‌ను గెలిపించలేరని అన్నారు. జార్ఘండ్, జమ్మూకాశ్మీర్, అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయ, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ సత్తా చాటిందన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలను ఓడించి బీజేపీకి పట్టం కట్టారన్నారు. దేశంలో దాదాపు 75 శాతం భూభాగాన్ని బీజేపీ ఏలుతున్నదని, రాబోయే కాలంలో తెలంగాణ భూభాగంలో కూడా పాలించితీరుతామని ఆయన జోస్యం చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహ్మరావు, అంజయ్యలాంటి నాయకులను హేళన చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అదరించరన్నారు. రాహుల్‌బాబా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలవదని అన్నారు. తెలంగాణలో రాహుల్‌బాబాను ప్రజలు పట్టించుకోరని తెలిపారు. ఆయనను అంతా ఓ రకంగా చూస్తున్నారని అమిత్‌షా ఎద్దెవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని, అదే తరహాలో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కుటుంబపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో దేశం కోసం ఉగ్రవాదులను తరిమికొట్టడానికి మొదటిసారిగా ఆమెరికా, రెండవసారి ఇజ్రయెల్ సర్జికల్ స్ట్రయిక్స్ చేశాయని, ఆ జాబితాలో మూడవ స్థానాన్ని మోదీ నాయకత్వంలో భారతదేశం నిలిచిందని అన్నారు. ఉగ్రవాదులను కాంగ్రెస్ పెంచి పోషించిందని ఆరోపించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం దేశభద్రతను కూడా మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దేశ భద్రత, సమగ్రత కోసమే పాకిస్తాన్ ఉగ్రముకలను సర్జికల్ స్ట్రైక్‌తో తుదముట్టించిన దేశసైనికులకు ప్రధాని అండగా నిలిచారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారని కష్టపడితే అధికారం సులువుగా దక్కుతుందని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనని అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హమీ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజానికం వ్యతిరేకించాలని కోరారు. రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని ఉందన్నారు. ఒకవేళ కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కోతవిధించి ముస్లింలకు కట్టబెట్టే ప్రమాదం ఉందని, అలాంటి సీఎంను ఓడించాల్సిందేనని ఈ బహిరంగసభ ద్వారా తాను తెలంగాణ ప్రజలను కోరుతున్నానని అమిత్‌షా వెల్లడించారు. ఈ బహిరంగసభలో మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎంవిఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.