రాష్ట్రీయం

మన ప్రతిభ పనికిరాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/సింహాచలం, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రతిభ గల ఇంజనీర్లను విస్మరించి సింగపూర్ కంపెనీలకు పనులు అప్పగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ కనీసం రాజధాని నిర్మాణ ప్రణాళికను రూపొందించలేకపోయారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. విశాఖలో పాదయాత్ర 262వ రోజు ప్రారంభానికి ముందు మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన ఇంజనీర్స్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, ఇంజనీర్లు ఉండగా, సింగపూర్ కంపెనీలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డారు. ఇప్పటి వరకూ సింగపూర్ కంపెనీ సాధించింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. ప్రపంచ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తెలుగు ఇంజనీర్లు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాధికారులు, మంత్రులు మొత్తం ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు కానీ, రాజధాని నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదన్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు కావస్తుండగా రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక కూడా పేర్చలేదని ధ్వజమెత్తారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారని, నాణ్యత గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు.

262వ రోజుకు పాదయాత్ర
అనంతరం జగన్ 262వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం చినగదిలి నుంచి ప్రారంభమై భీమునిపట్నం నియోజకవర్గంలో ప్రవేశించింది. చినగదిలిలో యాత్ర ప్రారంభానికి ముందు ఆంధ్రా యూనివర్శిటీ రీసెర్చ్ స్కాలర్ సురేష్ మీనన్ అనే దివ్యాంగుడు జగన్‌ను కలిసి వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రస్తావించారు. దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం రూపొందించారని, అయితే దీన్ని ఇప్పటికీ అమలు చేయట్లేదని ఆరోపించారు.