రాష్ట్రీయం

జయం మనదే......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జనవరిలో ఎన్నికలు రానేరావు * వారెంటు ఇస్తే భయపడను.. పోరాడుతా
* వైకాపా, జనసేన బీజేపీ తోకలే * ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15: కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నిధులు ఇవ్వకపోయినా, బీజేపీ తోక పార్టీలు వైకాపా, జనసేన కలిసి కుట్రలు..కుతంత్రాలు నడిపినా, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు తిరగబడిపోతాయంటూ తప్పుడు సర్వేలు రాస్తున్నా టీడీపీదే అంతిమ విజయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ముందస్తు ఎన్నికలు రానేరావని సుస్పష్టం చేసారు. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం.. రాష్ట్భ్రావృద్ధి కోసం.. రాజకీయాలకు అతీతంగా తాను పడుతున్న కష్టం తమదేనన్నారు. కేంద్రప్రభుత్వం తోకలైన వైకాపా, జనసేన పార్టీలు చేస్తున్న కుట్రలు.. కుతంత్రాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలో తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదికి జలసిరి హారతి ఇచ్చిన అనంతరం ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో తోటపల్లి రెగ్యులేటర్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, కోటబొమ్మాళి మండలం చిన్నసాన లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘విశాఖ రైల్వే జోన్ ఇవ్వరు.పోలవరం ప్రాజెక్టుకు నిధులు కూడా ఇవ్వరు.వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు వెనక్కి తీసుకుంటారు’ అటువంటి ఎనే్డయేతో కలిసి పనిచేస్తే ఐదుకోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసినట్టేనంటూ బాబు ఉద్ఘాటించారు. అందుకే, బీజేపీతో కటీఫ్ చేసుకుని కేంద్ర కేబినేట్‌లో అశోక్‌గజపతిరాజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అవిశ్వాస తీర్మానంలో ప్రపంచ దేశాలకు తెలిసేలా గళం వినిపించారన్నారు. అవినీతి పార్టీ నేత జగన్‌కు నైతికతలేకపోవడం వల్లే ఐదుకోట్ల ఆంధ్రులకు చెందిన రాజధానిని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. ఎన్డీయేతో కలిసి ఏపీ రాష్ట్రానికి జగన్ నష్టం కలిగిస్తున్నారన్నారు. వైకాపా పారిపోయే పార్టీయేనని, అందుకే అసెంబ్లీకిరారని, అటువంటి వారికి జీతాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత కోసం తల్లిదండ్రులు ఏలా ఆలోచిస్తారో అలాగే, తానుకూడా ఆలోచించి యువనేస్తం ద్వారా నెలకు రూ. 1000 భృతి ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నానన్నారు. రూ. 16 లక్షల కోట్లతో జరిగిన ఎంవోయూల వల్ల 32 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందనే నాడు పోరాటం చేసానని, బాబ్లీ ఏపీ సరిహద్దుల్లోనే ఉన్నప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుగా 2010 నాటి కేసుకు ఇప్పుడు అరెస్టు వారెంటు పంపడం తెలుగురాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం చేస్తున్న కుట్ర ఏమిటో అర్థం కావడం లేదు. మనమేమైనా బానిసలమా, ప్రధానిమంత్రిని ఎదురించి అడిగితే కేసులు పెడతారా, భయపడేదే లేదంటూ బాబు అన్నారు. నాకు కుట్రలు, కుతంత్రాలు తెలియవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎక్కువ పరిపక్వత ఉందని, తనకు లేదంటూ మోదీ పేర్కొనడం వల్ల నష్టం ఏమీ లేదన్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన న్యాయ సమ్మతమైన హక్కుల కోసం పోరాటం చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రానికి తెలుగుప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రధానిమంత్రిని వ్యతిరేకిస్తే తప్పుడు కేసులు పెట్టేందుకు సాహసిస్తారంటే, పద్నాలుగేళ్లు తాను ముఖ్యమంత్రిగా గల అనుభవంతో తెలుగోళ్ళను అవమానిస్తున్న కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకు వెనుకాడనంటూ అల్టిమేటం ఇచ్చారు.

నాగావళికి జలసిరి హారతి
పూర్వీకుల నుంచి జలాన్ని పూజించడం వల్లే ప్రకృతి కరుణించి అన్నదాతలను సుఖసంతోషాలతో ఉంచేలా చేస్తుందని, అటువంటి పవిత్రమైన నదులను ఆరాధించడం తాను ఎంతో పుణ్యం చేసుకున్నానంటూ ఇక్కడ తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలసిరి హారతి ఇచ్చారు. పుష్పాలతో పూజలు నిర్వహించి, పసుపు, కుంకమలతో పవిత్ర నాగావళి నదిని అంకితమై భావంతో ఆరాధించారు. ప్రకృతిని ఆరాధిస్తే కరుణిస్తుందన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నాగరికత అంతా నదుల పక్కనే జరిగాయన్న చరిత్రను ఒక్కసారి తిరగతోడితే సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు. కృష్ణానదిపై హక్కు ఉందని ఎన్టీఆర్ పోరాటపటిమే తనలో నాలుగేళ్ళుగా జలదీక్ష చేసేందుకు ప్రేరణ కలిగించిందన్నారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో రెండు పంటలకు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవరకూ ఈ దీక్ష వీడనంటూ పేర్కొన్నారు. గోదావరి - కృష్ణ - నాగావళి - వంశధార - పెన్నా నదుల పవిత్ర సంగమంతో రాష్ట్రాన్ని కరువురహితంగా మారుస్తానన్నారు. పట్టిసీమద్వారా గోదావరి - కృష్ణ అనుసంధానం దేశంలోనే రికార్డు అన్నారు. నాగావళి - వంశధార నదులను రూ. 85 కోట్లుతో డిసెంబరునాటికి అనుసంధానం చేస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ రాబోయే సీజన్‌కి సాగునీరు రైతాంగానికి అందించేలా పనులు పూర్తి చేస్తామన్నారు. నారాయణపురం ఆధునికీకరణ కోసం రూ. 112 కోట్లతో ఈ ఏడాదిలో పూర్తిచేస్తామన్నారు. మడ్డువలస నీరు 21 గ్రామాల్లో 12,500 ఎరకాలకు ఇచ్చామన్నారు. నాలుగేళ్ళలో 28 ప్రాజెక్టులు పూర్తిచేసామని, మరో 12 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. రానున్న రెండేళ్ళలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానంటూ హామీ ఇచ్చారు. మాటలు చెప్పడం చాలా సులభమని, పనులు చేసి చూపడం చాలా కష్టమన్నారు. ప్రతీ కుటుంబానికి 1 - 5 లాభాలు ఇచ్చామని, 2014 ఎన్నికల్లో గెలుపు తాను మరిచిపోలేదని, ఇబ్బందిలేని, అవినీతిలేని పాలనను ఇస్తున్నాని, పరిపాలనలో సంస్కరణలు తీసుకువస్తున్న తనను రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఆశీర్వదించాలంటూ ప్రజలను బాబు కోరారు.