రాష్ట్రీయం

సింహ, ముత్యపు పందిరి వాహనాలపై స్వామివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అనంత తేజోమూర్తయిన శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపైన, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారు గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సింహం పరాక్రమానికి , ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహ దర్శనం’ అతి ముఖ్యమైనది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. కాగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వర కు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.

ముత్యపు పందరిపై మురిపించిన లక్ష్మీపతి
శనివారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ నయనాందకరంగా సాగింది. స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి. ఒకవైపు వర్షపు చినుకులు పడుతున్నా భక్తులు మాత్రం అచంచల విశ్వాసంతో ఉన్నచోటు నుంచి కదలకుండా స్వామివారిని చూస్తూ ఉండిపోయారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుంచి రాలి, దుర్లభమైన మానవ జన్మను సంతరించుకుంటుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి ఎకె సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, అధికారులు పాల్గొన్నారు.