రాష్ట్రీయం

నెమలి వాహనంపై కాణిపాకం వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు సిద్ధిబుద్ధి సమేతంగా నెమలి వాహనం అధిరోహించి మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఈ వాహన సేవకు కాణిపాకం, చిన్నకాంపల్లి, కొత్తపల్లి, చిగర్లపల్లి, వడ్రాంపల్లి, దామరకుంట, కురపల్లెకు చెందిన రెడ్డి కులస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితుడైన ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సిద్ధిబుద్ధి సమేత వినాయకస్వామి వార్లను నెమలి వాహనంపై ఆశీనులు చేసి విద్యుద్దీపాలంకరణతో, మేళతాళాల మధ్య మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేష్, ఏఈఓలు కేశవరావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.