రాష్ట్రీయం

అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సీపీఎస్ ఉద్యోగుల సమావేశంలో నిర్ణయం
* హాజరైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 16: కొత్త పెన్షన్ పథకం (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్/ సీపీఎస్) రద్దుకు అఖిల పక్షాలు మద్దతు పలికాయి. వచ్చే ఎన్నికల్లో తమతమ పార్టీల మేనిఫెస్టోల్లో సీపీఎస్ రద్దుకు హామీ ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. సీపీఎస్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్వర్యంలో ఆదివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధికార టీఆర్‌ఎస్ మినహా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, విపక్షాలు టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలన్న తీర్మానాన్ని అఖిల పక్షాలు ఆమోదించాయి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దును చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైన పీసీసీ ప్రధాన కార్యదర్శి సీజే శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఉద్యోగులు మద్దతిస్తే, తాము వారి వెంటే ఉంటామని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దును చేరుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అశ్రాస్తీయ సీపీఎస్ విధానాన్ని రద్తు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ ద్వారా సీపీఎం రద్దు పెద్ద కష్టమేమీ కాదన్నారు. సీపీఐ తరఫున హాజరైన పస్య పద్మ మాట్లాడుతూ, సీపీఎస్ రద్దుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. సీపీఎం ప్రతినిధిగా వచ్చిన కే. వేణుగోపాల్ మాట్లాడుతూ, సీపీఎస్ రద్దు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనన్నారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ మాట్లాడుతూ, పెన్షన్ స్కీమ్ షేర్ మార్కెట్ ఆటు పోట్లకు గురయ్యేలా ఉండదన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పే ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయలేకపోయిందని విమర్శించారు. టీజేఎస్ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దును చేర్చుతామన్నారు. యువ తెలంగాణ పార్టీ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దుకు హామీ ఇవ్వనున్నట్టు ఆ పార్టీ తరఫున హాజరైన రాణి రుద్రమదేవి స్పష్టం చేసారు. సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, సీపీఎస్ రద్దుకు టీఆర్‌ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఉద్యోగుల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అందరికీ స్పష్టమైందని వ్యాఖ్యానించారు.