రాష్ట్రీయం

గుప్త నిధుల కోసంనంది విగ్రహం పేల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16: మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేగింది. గుప్త నిధుల కోసం ఏకంగా ఓ దేవాలయంలో జిలెటిన్‌స్టిక్స్ (డైనమెట్ల)తో నంది విగ్రహన్ని పేల్చివేసిన ఘటన సంచలనం సృష్టించింది. నవాబుపేట మండలం మరికల్ గ్రామ శివారులోగల శ్రీ చింతల బసవేశ్వరస్వామి దేవాలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన గుర్తు తెలియని దుండగులు ఏకంగా దేవాలంలోని నంది విగ్రహన్ని పేల్చి వేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పదకొండవ శతాబ్దంలో చాణక్యులు, రెడ్డిరాజుల కాలంలో నిర్మించిన దేవాలయం వారి హయంలో ఓ వెలుగు వెలిగింది. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అనేక మార్లు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఎలాంటి నిధులు దొరక్కపోయినా, ఆశ వదులుకోని కొందరు గత నెలలో హర్యానాకు చెందిన ఓ అగంతకుని తమ వెంట తీసుకువచ్చి తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం విఫలమై, పోలీసులకు చిక్కారు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున జిలెటిన్‌స్టిక్స్‌తో పేల్చివేయగా విగ్రహం పూర్తిగా చెల్లా చెదురైంది. మహిమాన్వీతమైన ఈ క్షేత్రంలో భారీ పేలుళ్లు చోటు చేసుకోవడంతో స్వామి భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు. పేలుళ్ల విషయం తెలిసిన వెంటనే వందలాది మంది అక్కడికి చేరుకొని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే మహబూబ్‌నగర్ రూరల్ సీఐ కిషన్, హన్వాడ ఎస్సై రాంబాబు, కోయిల్‌కొండ ఎస్సై జంబులప్పలు భారీ పోలీసులతో అక్కడికి చేరుకుని బాంబు స్క్వాండ్, పోలీస్ జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అలాగే దుంగడుల వేలుముంద్రలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ కిషన్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న చింతల బసవేశ్వర స్వామి దేవాలయంలో పేలుళ్లు జరగడం దురదృష్ట కరమని అన్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుని తీరుతామని గ్రామస్తులకు హామీ ఇచ్చి ఆందోళనను విరమింప జేశారు. కాగా, పేలుడు శబ్దం వినిపించగా ఎవరో రైతు పంట పొలాల దగ్గర టపాసులు పేల్చి ఉంటారని భావించామని గ్రామస్తులు తెలిపారు. ఈ శబ్దం తెల్లవారుజామునే వచ్చిందని వెల్లడించారు.